Tamil Nadu : తమిళనాడులో పరువు హత్య నడిరోడ్డుపై చెల్లెలి భర్తను నరికి చంపిన అన్న..!!

Advertisement

Tamil Nadu : ప్రస్తుత రోజుల్లో పరువు హత్యలు ఉన్నా కొద్ది పెరిగిపోతున్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం అప్పట్లో చేసిన తప్పులు మళ్ళీ ఇప్పుడు రిపీట్ అవుతూ ఉన్నాయి. ప్రస్తుత రోజుల్లో చాలామంది యువత కులపిచ్చి భావనకు లోనవుతుంది. దీంతో పంతాలకు పోయి… ఒకరి ప్రాణాలు మరొకరు తీసుకుంటు న్నారు. ఈ రకంగానే తమిళనాడులో తల్లిదండ్రులకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న చెల్లెలు భర్తని సోదరుడు అతికిరాతకంగా నడిరోడ్డుపై కాపు కాసి చంపేశాడు. చెల్లి ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న కారణంతో అతి దారుణంగా కిరాతకంగా నరికి చంపేశాడు. తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లా కిట్టపట్టి గ్రామానికి చెందిన జగన్ టైల్స్ పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు.

Advertisement
Tamil Nadu Telugu Latest Updates
Tamil Nadu Telugu Latest Updates

అవధానపట్టి సమీపంలోని తలకాన్ కోట ఇన్ ప్రాంతానికి చెందిన శంకర్ కుమార్తె శరణ్య… జగన్ కొన్ని సంవత్సరాలుగా ప్రేమించుకోవడం జరిగింది. వీరి ప్రేమకు పెద్దలు అంగీకరించలేదు. దాంతో నెలరోజుల క్రితం ఇద్దరూ పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం జరిగింది. దాంతో శరణ్య కుటుంబ సభ్యులు జగన్ పై పగ పెంచుకున్నారు. తల్లిదండ్రుల కంటే శరణ్య అన్నయ్య కోపంతో రగిలిపోయాడు. దీంతో తమ బంధువులలో కొంతమంది యువకులతో కలిసి జగన్ నీ మట్టు పెట్టడానికి ప్లాన్ వేయడం జరిగింది. జగన్ నీ హతమార్చడానికి చాలా స్కెచ్ లు వేసి… గాలించి అవకాశం కోసం ఎదురు చూడటం జరిగింది. ఈ క్రమంలో ఒకరోజు … జగన్ పనిమీద కావేరి పట్టణానికి బయలుదేరడం జరిగింది.

Advertisement

అప్పటికే కాపు కాసిన శరణ్య అన్నయ్య … బంధువులు..జగన్ నీ KRP డ్యాం సమీపాన ఆపడం జరిగింది. ఒక్కసారిగా అందరూ జగన్ పై కత్తులతో దాడి చేయడం జరిగింది. నడిరోడ్డుపై విచక్షణ రహితంగా పొడవడం జరిగింది. జగన్ మృతి చెందాడని నిర్ధారించుకుని అక్కడ నుంచి పారిపోయారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ స్టార్ట్ చేశారు. భర్త మృతితో శరణ్య బోరుణ విలపించింది. ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకుని సంతోషంగా జీవిస్తున్న సమయంలో… తన వల్లే జగన్ ప్రాణాలు పోయాయి అంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. తమిళనాడులో జరిగిన ఈ హత్య సంచలనం సృష్టించింది.

Advertisement
Advertisement