Chandrababu : ఈ ఒక్క సంఘటనతో చంద్రబాబు పరువు మొత్తం పోయింది..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : ఈ ఒక్క సంఘటనతో చంద్రబాబు పరువు మొత్తం పోయింది..!

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీపీఎం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు.. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అంటేనే పచ్చి అవకాశ వాది అంటూ మండిపడ్డారు. బీజేపీ అసలు దేశం అభివృద్ధి కోసం ఎలాంటి పని చేయడం లేదని గతంలో అన్న చంద్రబాబు.. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధిని పొగడటం ఏంటి. మోదీ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. అసలు.. మోదీ పేదలకు ఇచ్చిన ఏ ఒక్క […]

 Authored By kranthi | The Telugu News | Updated on :29 April 2023,9:00 pm

Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై సీపీఎం నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తమ్మినేని వీరభద్రం, శ్రీనివాసరావు.. ఆయనపై విమర్శల వర్షం కురిపించారు. చంద్రబాబు అంటేనే పచ్చి అవకాశ వాది అంటూ మండిపడ్డారు. బీజేపీ అసలు దేశం అభివృద్ధి కోసం ఎలాంటి పని చేయడం లేదని గతంలో అన్న చంద్రబాబు.. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధిని పొగడటం ఏంటి. మోదీ ఇప్పుడు దేశానికి ఏం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. అసలు.. మోదీ పేదలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టుకోలేదని ఫైర్ అయ్యారు.

tammineni veerabhadram and srinivasa rao fires on chandrababu

tammineni veerabhadram and srinivasa rao fires on chandrababu

2019 ఎన్నికలకు ముందు ఎన్డీఏతో, ప్రధాని మోదీతో తెగతెంపులు చేసుకున్నారు చంద్రబాబు. మోదీని తీవ్రస్థాయిలో అప్పుడు దూషించారు. ఇప్పుడు మోదీ చేస్తున్న దేశాభివృద్ధి ఏంటో చంద్రబాబు ప్రజలకు చెప్పాలన్నారు. రైతుల ఆదాయం డబుల్ చేస్తానన్న హామీ ఏమైంది. 2022 వరకు దేశంలో బుల్లెట్ ట్రెయిన్స్ నడుస్తాయన్నారు. బుల్లెట్ ట్రెయిన్ లో చంద్రబాబు ఇప్పుడు తిరుగుతున్నారా? అంటూ ఎద్దేవ చేశారు. 18 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. అవి ఇచ్చారా? చంద్రబాబు మోదీలో ఏం చూస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ..

why chandrababu has no clarity on gudivada tdp candidate

why chandrababu has no clarity on gudivada tdp candidate

Chandrababu : 18 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సిన మోదీ అవి ఇచ్చారా?

ఆయన నిజంగా అభివృద్ధి చేశారని కాదు.. అవకాశవాదం కోసం మోదీని చంద్రబాబు పొగడ్తల్లో ముంచెత్తుతున్నారు. ఎలాగోలా ఏపీలో అధికారంలోకి రావాలని చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే.. ఇవన్నీ జిత్తులు చేస్తున్నారు. మోదీ, చంద్రబాబులది విజన్ కాదు.. అది డివిజన్. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను టీడీపీ వ్యతిరేకిస్తోందని చెబుతున్నారు. మరి.. మోదీ ప్రభుత్వమే ప్రైవేటీకరణ చేస్తున్నారు కదా. చంద్రబాబు ఏ విజన్ తో మోదీకి సపోర్ట్ చేస్తున్నారు.. అంటూ శ్రీనివాసరావు ప్రశ్నించారు. చంద్రబాబుది కేవలం రాజకీయ అవకాశవాదం.. అంతకుమించి ఇంకోటి లేదు.. అంటూ శ్రీనివాసరావు దుయ్యబట్టారు.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది