Taraka Ratna : వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ తరపున ప్రచారం.. తారకరత్న..!
Taraka Ratna : నందమూరి తారకరత్న మొదటిగా సీనియర్ ఎన్టీఆర్ మనవడిగా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. ఆ తర్వాత కెరియర్ మొదటి దశలోనే వరుస సినిమాలను చేసి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారాడు. ఆ తర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరమయ్యాడు. కొన్నాళ్ల తర్వాత మరల రవిబాబు అమరావతి చిత్రంలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అప్పటినుండి అడపాదడపా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. కేవలం హీరోగా మాత్రమే కాకుండా హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా వెబ్ సిరీస్ లో సైతం నటిస్తూ వస్తున్నాడు. అయితే తాజాగా తారకరత్న
చేసిన వ్యాఖ్యలు చూస్తే ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్లుగా అర్థమవుతుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ కూడా సమయం వచ్చినప్పుడు టిడిపి పార్టీ తరఫున ప్రచారం ,చేస్తుంటాడని చెప్పుకొచ్చాడు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. వివరాల్లోకెళ్తే గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజకవర్గంలో ఆదివారం రోజు జరిగిన న్ ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో తారకరత్న పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తాతగారి విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు . ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. 1982లో అందరికీ కూడు ,గూడు,గుడ్డ అనే నినాదంతో వారి తాతగారైన నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారని,
నేడు పేద ప్రజానీకానికి అతి పెద్ద గోపురం గా మారిందని చెపుకొచ్చాడు. మన రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు నాయుడుని మరల సీఎంగా ఎన్నుకోవాలని, టిడిపి అధికారంలోకి వస్తేనే రామన్న రాజ్యం మరల వస్తుందని అందుకోసం నా అడుగు ఎప్పుడు జనాలవైపు , నా చూపు ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి వైపు అంటూ , తారకరత్న వారి యొక్క కార్యసాధన ను ఈ సందర్భం గా తెలియజేసారు…అలాగే తన తమ్ముడు అయినా జూనియర్ ఎన్టీఆర్ సైతం అవసరం అయినప్పుడు టిడిపి తరఫున ప్రచారానికి తప్పనిసరిగా వచ్చి పాల్గొంటారని తెలిపారు.
దీంతో తారకరత్న చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాలలో హాట్ న్యూస్ గా మారింది. అలాగే తారకరత్న కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించడంతో, ఆయన ఎక్కడినుండి బరిలోకి దిగుతారని చర్చ మొదలైంది. అయితే కొందరు గుడివాడ నుంచి పోటీ చేయాలనుకుంటే మరి కొందరు కృష్ణ జిల్లాలో చేయాలని అంటున్నారు. అయితే తారకరత్న మాత్రం తాను ఎక్కడి నుంచి పోటీ చేస్తాడనే విషయాన్ని తెలియపరచలేదు. కానీ ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా పాల్గొంటారని క్లారిటీ ఇచ్చారు. మరి ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.