Tatkal | దీపావళి, ఛత్ పండుగల రద్దీకి సిద్ధమవుతున్న రైల్వే.. తత్కాల్ టికెట్ల కోసం కొత్త నిబంధనలు

 Authored By sandeep | The Telugu News | Updated on :30 September 2025,6:30 pm

Tatkal | దేశంలో ప్రతిరోజూ సుమారు 2.5 కోట్ల మంది రైలులో ప్రయాణిస్తున్న విషయం తెలిసిందే. అయితే అక్టోబర్-నవంబర్‌ మధ్య వచ్చే దీపావళి (Diwali 2025), ఛత్ పూజ వంటి పెద్ద పండుగల సమయంలో ఈ రద్దీ మరింతగా పెరుగుతుంది. ప్రయాణికుల బారులు తీరే సమయంలో టికెట్ కన్ఫర్మ్ చేసుకోవడం చాలామందికి పెద్ద సవాలుగా మారుతోంది. ఈ నేపథ్యంలో తత్కాల్ టికెట్ బుకింగ్, ప్రత్యేక రైళ్లు, నూతన నిబంధనలు వంటి అంశాల్లో మార్పులు చేసినట్లు భారతీయ రైల్వే వెల్లడించింది.

#image_title

తత్కాల్ టికెట్ బుకింగ్ – ముఖ్య సమాచారం

ఆఖరి నిమిషంలో ప్రయాణించాల్సిన అవసరం వచ్చినప్పుడు తత్కాల్ టికెట్లే భరోసా. అయితే వాటిని పొందడం కోసం కొన్ని నియమాలు తెలుసుకోవడం అవసరం.

AC కోచ్‌ల తత్కాల్ బుకింగ్: ఉదయం 10:00 గంటలకు ప్రారంభమవుతుంది.

స్లీపర్ క్లాస్ తత్కాల్ బుకింగ్: ఉదయం 11:00 గంటలకు మొదలవుతుంది.

ప్రయాణానికి ఒక రోజు ముందు తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలి.
ఉదా: అక్టోబర్ 18న ప్రయాణిస్తే, అక్టోబర్ 17న బుకింగ్ చేయాలి.

టికెట్ల కోటా పరిమితం కావడంతో, కొద్ది నిమిషాల్లోనే బుకింగ్ పూర్తవుతుంది. అందుకే మీరు ముందుగానే IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా సిద్ధంగా ఉండాలి.

Tags :

    sandeep

    No bio available for this author.

    Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి