House loans : ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్.. పన్ను మినహాయించనున్న కేంద్రం.. | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

House loans : ఇల్లు కొనేవారికి గుడ్‌న్యూస్.. పన్ను మినహాయించనున్న కేంద్రం..

 Authored By mallesh | The Telugu News | Updated on :21 January 2022,3:20 pm

House loans : మరో పది రోజుల్లో కేంద్రం ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. కరోనా వ్యా్ప్తి మొదలైనప్పటి నుంచి దాదాని అన్న రంగాలు సంక్షోభంలో చిక్కుకున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం థర్డ్‌వేవ్ మొదలైంది. ఒమిక్రాన్ సైతం వ్యాప్తి చెందుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. కరోనా నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకోవడానికి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలో కేంద్రం ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఇక ఈ బడ్జెట్‌పై అందరికీ ఇంట్రెస్ట్ పెరిగింది.

ఇళ్లు కొనుగోలు చేసేవారికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇన్‌కమ్ ట్యాక్స్ చట్టంలోని సెక్షన్ 80సి కింద గృహ రుణం అసలు చెల్లింపుపై.. పన్ను మినహాయింపు యానువల్ లిమిట్‌ను రూ.1.5 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం మొగ్గు చూసుతోంది.మినహాయింపునకు సంబంధించి కేంద్రం నుంచి ప్రకటన వస్తే.. చాలా మంది సామాన్యులకు లబ్ధి చేకూరుతుంది. దీనితో పాటు రియల్ ఎస్టేట్ రంగానికి సైతం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

tax deduction for House loans buyers

tax deduction for House loans buyers

House loans : అలా చేస్తే చాలా మందికి మేలు

ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద, ఇల్లు కొనుగోలు చేసేవారు హౌస్ లోన్ ప్రధాన చెల్లింపుపై పన్ను మినహాయింపు పొందవచ్చు. కానీ, 80సీ కింద మ్యూచువల్ ఫండ్స్, పీపీఎఫ్, ఎన్ఎస్‌సీ పన్ను పథకాలతో పాటుగా అనేక ఇతర పథకాలు ఉన్నాయి. వాటిలో పెట్టుబడి పెట్టడం వల్ల పన్ను మినహాయింపు పొందొచ్చు. ప్రిన్సిపల్స్ పై మినహాయింపు పరిమితిని చివరి సారిగా 2014లో పెంచారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దీనిని టచ్ చేయలేదు. దీంతో దీనిని పెంచేందుకు కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఆసక్తి చూసుతున్నట్టు తెలుస్తోంది. మరి దీనిపై ఎలాంటి ప్రకటన వస్తుందో తెలియాలంటూ మరో పది రోజులు ఆగక తప్పదు.

mallesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది