House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

 Authored By ramu | The Telugu News | Updated on :12 June 2025,6:00 pm

ప్రధానాంశాలు:

  •  House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఇటీవల మానిటరీ పాలసీ కమిటీ సమావేశంలో రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు తగ్గిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితంగా రెపో రేటు 6% నుండి 5.5%కి చేరింది. దీని ప్రభావంతో బ్యాంకులు హోమ్ లోన్ల వడ్డీ రేట్లను తగ్గించనున్నాయి. రెపో రేటు అంటే RBI బ్యాంకులకు ఇచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీ. ఇది తగ్గితే, బ్యాంకులు కూడా తమ వినియోగదారులకు తక్కువ వడ్డీతో లోన్లు ఇచ్చే వీలుంటుంది.

House Loan మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా అయితే మీకు గుడ్ న్యూస్

House Loan : మీరు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్..!

House Loan : సొంతంటి కల నెరవేర్చుకునేందుకు ఇదే సరైన సమయం..ఎలా అంటే !!

ఇప్పటికే హోమ్ లోన్ తీసుకున్నవారికి EMIs తగ్గే అవకాశముండగా, కొత్తగా ఇల్లు కొనాలనుకునేవారికి ఇది ఒక గొప్ప అవకాశంగా మారింది. ఫ్లోటింగ్ రేటు లోన్ల వడ్డీలు రెపో రేటుతో లింక్ అయి ఉండటంతో వాటిపై వడ్డీ తగ్గుతోంది. ఇప్పటికే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), యూనియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వంటి పలు బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లను ప్రకటించాయి. దీంతో హోమ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఇది చక్కని అవకాశం.

ప్రస్తుతం హోమ్ లోన్ వడ్డీ రేట్లు బ్యాంకు, CIBIL స్కోరు, ఆదాయం, ఉద్యోగ స్థితి, లోన్ మొత్తం, తిరుగుబాటుకు గడువు వంటి అంశాల ఆధారంగా మారుతున్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, యూనియన్ బ్యాంక్ 7.85% వడ్డీతో హోమ్ లోన్లు అందిస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ 8% నుండి ప్రారంభమవుతోంది. ప్రైవేట్ బ్యాంకుల్లో మాత్రం సాధారణంగా 8% కంటే అధిక వడ్డీ ఉంటుంది. మౌలిక వసతుల కల్పన, గృహ కల సాకారం చేసుకునే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయం ప్రజలపై ఆర్థిక ఒత్తిడిని తగ్గించి, రియల్ ఎస్టేట్ రంగాన్ని ఉత్సాహపరచనుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది