TDP : వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చిన టీడీపీ అభ్యర్థి? అక్కడంతా రివర్స్?
TDP : ఏపీలో రాజకీయాలంటేనే ముఖ్యంగా టీడీపీ, వైసీపీ మధ్య. ఎందుకంటే అవే ఏపీలో ప్రధాన పార్టీలు. కాంగ్రెస్, బీజేపీ, ఇంకా ఇతర పార్టీలు ఉన్నా… వీటి తర్వాతనే. అందుకే ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా.. ప్రధాన పోటీ మాత్రం ఈ రెండు పార్టీల మధ్యే ఉంటుంది. అలాగే… ఈరెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమంటుంది. రెండడు పార్టీల నాయకులు ఎదురుపడితే చాలు కయ్యానికి కాలు దువ్వడమే. అది.. రెండు పార్టీల మధ్య ఉన్న పగ. అందుకే.. ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా… వైఎస్సార్సీపీ, టీడీపీ మాత్రం పొత్తు పెట్టుకునే చాన్సెస్ అయితే అస్సలు ఉండవు.
అలాంటిది.. తాజాగా జరిగిన ఓ విచిత్రాన్ని తెలుసుకుంటే మీరు కూడా ఆశ్చర్యపోతారు. విశాఖపట్టణం జిల్లా చోడవరం నియోజకవర్గంలోని ఓ గ్రామం చింతపాక. అక్కడ ఎంపీటీసీ పదవికి పోటీకి దిగిన ఓ టీడీపీ అభ్యర్థి.. తాను టీడీపీ తరుపున పోటీ చేయడం లేదంటూ తప్పుకున్నారు. దీంతో టీడీపీ నేతలు షాక్ అయ్యారు.
ఆ తర్వాత అదే గ్రామంలో ఎంపీటీసీ అభ్యర్థిగా వైసీపీ నుంచి బరిలోకి దిగిన మరో అభ్యర్థికి తన మద్దతు ప్రకటించారు. అంతే కాదు… టీడీపీ అధినేత చంద్రబాబు పరిషత్ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేయడం లేదంటూ ప్రకటించడం వల్ల పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె ప్రకటించారు. అదంతా ఓకే కానీ… వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడం ఏంటి? అంటూ ఆ ఊరి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అయితే… ప్రస్తుతం ఏపీ హైకోర్టు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై స్టే విధించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ… క్షేత్రస్థాయిలో రాజకీయాలు జరుగుతూనే ఉన్నాయి.
TDP : ఎమ్మెల్యే మీద ఉన్న గౌరవంతో వైసీపీకి మద్దతు ఇస్తున్నా
అయితే… వైసీపీ ఎమ్మెల్యే మాట కోసం, ఆయన మీద ఉన్న గౌరవంతో తాను ఈ పోటీ నుంచి తప్పుకోవడమే కాకుండా.. వైసీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చానని ఆమె ప్రకటించడంతో.. ఇక ఆ గ్రామంలో వైసీపీ గెలుపుకు దారి క్లియర్ అయిపోయింది.
కానీ… చుట్టుపక్కల గ్రామాల టీడీపీ నేతలకు మాత్రం ఇది ఇబ్బందికరంగా మారింది. టీడీపీ నుంచి పోటీ చేసి.. తప్పుకొని వైసీపీకి మద్దతు ఇవ్వడంతో…. ఆ ప్రభావం చుట్టుపక్కన గ్రామాల మీద కూడా పడుతుందని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు.