TDP : మీరు ఏది చెబితే అది చేస్తా.. నన్ను మాత్రం అరెస్ట్ చేయకండి.. వైసీపీ ఎంపీతో టీడీపీ మాజీ మంత్రి?
TDP : ప్రస్తుతం వైఎస్సార్సీపీ పార్టీ ఏపీలో అధికారంలో ఉంది. అధికారంలో ఉన్న పార్టీ ఏం చేసినా నడుస్తుంది. అధికారంలో ఉంటే మామూలుగా ఉంటుందా? అందుకే… ఏపీ ప్రభుత్వం ప్రస్తుతం టీడీపీలో అక్రమాలు చేసిన నాయకులపై టార్గెట్ చేసింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో అక్రమాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిందని.. తాము అధికారంలోకి వచ్చాక… టీడీపీ నేతల అక్రమాల గుట్టును రట్టు చేస్తామని ముఖ్యమంత్రి కాకముందే సీఎం జగన్ చెప్పారు. చెప్పినట్టే ఇప్పుడు టీడీపీలో అక్రమాల గుట్టును బయటపెడుతున్నారు. తాజాగా గుంటూరు జిల్లాకు చెందిన టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను సంగం డెయిరీ అవినీతి కేసులో ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇదివరకు అచ్చెన్నాయుడిని కూడా ఇదే తరహాలో అరెస్ట్ చేశారు. తాజాగా నరేంద్రను కూడా అరెస్ట్ చేయడంతో టీడీపీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది.

tdp former minister ready to join in ysrcp
టీడీపీ నేతలు కూడా కొంచెం ఆందోళనకు గురయ్యారు. చెప్పాపెట్టకుండా… ముందస్తు సమాచారం లేకుండా అలా డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేయడం ఏంటంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. అయితే… తమపై కూడా ఎలాంటి అవినీతి ఆరోపణలు చేసి ఏపీ ప్రభుత్వం ఎక్కడ కేసులు పెట్టి అరెస్ట్ చేస్తుందోనని భయపడి టీడీపీకి చెందిన ఇద్దరు మాజీ మంత్రులు ముందే సర్దుకుంటున్నారట. వైసీపీతో ఒప్పందం చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారట. ఆ మాజీ మంత్రులు వీళ్లే అంటూ కొందరి పేర్లు చక్కర్లు కొడుతున్నా.. అది నిజమో అబద్ధమో మాత్రం తెలియదు.
TDP : సిట్టింగ్ ఎంపీతో చర్చించిన టీడీపీ మాజీ మంత్రి
అయితే.. అందులో ఒక మాజీ మంత్రి… ప్రస్తుతం వైసీపీ ఎంపీ దగ్గరికి వెళ్లారట. అక్కడ వీళ్లిద్దరూ చాలాసేపు భేటీ అయ్యారట. చాలా విషయాల మీద చర్చించుకున్నారట. అయితే.. టీడీపీ మాజీ మంత్రి మాత్రం… ముఖ్యమైన విషయం మీద మాట్లాడారట. మీరు గ్రీన్ సిగ్నల్ ఇస్తే… నేను వైసీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నాను. నేను ప్రస్తుతానికి ఏదో టీడీపీలో ఉన్నానా? అంటే ఉన్నాను… కానీ పెద్దగా చేసేదేం లేదు అక్కడ. అందుకే… మీకు ఓకే అయితే వైసీపీలో చేరడానికి నేను రెడీ. నన్ను మాత్రం కాస్త కనికరించండి. నాపై దయ చూపి… నన్ను ఏం చేయకుండా వదిలేయండి.. అని తెగ బతిమిలాడారట.
టీడీపీ హయాంలో ఆ సదరు వ్యక్తి మంత్రిగా ఉన్నారట. అప్పుడు ఓ పథకానికి సంబంధించిన విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిందట. దాంట్లో అవకతవకలు జరిగాయని.. రిపోర్ట్ లో ఉందట. ఆ రిపోర్ట్ ను పట్టుకొని తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో… అని ముందే ఆ మాజీ మంత్రి కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి సీఎం జగన్ వైసీపీలోకి ఎవ్వరినీ చేర్చుకోవడం లేదు. దీంతో పార్టీలో చేర్చుకోకున్నా… కనీసం తనను అరెస్ట్ కాకుండా చూడాలని ఎంపీని తెగ బతిమిలాడారట. దీంతో సరే.. చూద్దాంలే అని ఆ ఎంపీ.. మాజీ మంత్రితో అన్నట్టు సమాచారం.