Raghurama Krishnam Raju : రఘురామ కృష్ణంరాజు ఇచ్చిన బూస్ట్ తో మళ్ళీ పుంజుకున్న టీడీపీ ?
Raghurama Krishnam Raju : పేరుకు వైసీపీ పార్టీకి ఎంపీ. కానీ.. చేసే పనులన్నీ వైసీపీ పార్టీకి వ్యతిరేకమే. మనం మాట్లాడుకునేది రఘురామ కృష్ణం రాజు గురించే. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి వైసీపీపై తన అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. సీఎం జగన్ పై ఆరోపణలు చేస్తున్నాడు. కానీ.. చివరకు తన సొంత నియోజకవర్గం అయిన నరసాపురాన్ని మాత్రం రఘురామ మరిచిపోయినట్టు తెలుస్తోంది. ఆయన ఎంపీ అయినప్పటి నుంచి ఒక్కసారి కూడా తన సొంత నియోజకవర్గాన్ని రఘురామ సందర్శించలేదట. ఎప్పుడూ ఢిల్లీలోనే ఉంటూ రచ్చబండ అనే పేరుతో వైసీపీపై, సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నాడు కృష్ణంరాజు. అవన్నీ పక్కన పెడితే ఏపీలో ఇటీవల రఘురామ ఓ సర్వే నిర్వహించాడట. ఆ సర్వేలో వచ్చే ఎన్నికల్లో ఏపీలో వైసీపీ ఓడిపోబోతోందట. టీడీపీ గెలవబోతుందట. తన సర్వేలో టీడీపీ గెలువబోతోందని వెల్లడయిందని చెప్పుకొచ్చాడు రఘురామ.
Raghurama Krishnam Raju : 93 స్థానాల్లో టీడీపీ గెలుస్తుందట
రఘురామ సర్వే ఫలితాలు ప్రకటించడంతో టీడీపీ శ్రేణుల్లో ఒకరకమైన ఉత్సాహం వచ్చేసింది. జూన్, జులై రెండు నెలల్లో నిర్వహించిన ఈ సర్వేలో టీడీపీకి 93 స్థానాలు వస్తాయని తేలిందట. కొన్ని స్థానాల్లో టీడీపీ, వైసీపీ నువ్వా నేనా అన్నట్టుగా ఫైట్ ఉందని.. అందులో కనీసం సగం స్థానాల్లో టీడీపీ గెలిచినా.. టీడీపీకి మొత్తం 120 నుంచి 130 లోపు స్థానాలు వస్తాయని.. అలా ఈజీగా టీడీపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. వైసీపీ.. 10 స్థానాల్లో కూడా గెలవదని చెప్పారు. ఒకవేళ కీ ఫైట్ ఉన్న స్థానాల్లో 90 శాతం వైసీపీ గెలిస్తేనే వైసీపీకి కనీసం 73 స్థానాలు అయినా వస్తాయని రఘురామకృష్ణంరాజు చెప్పుకొచ్చారు.
ఏపీలో చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో టీడీపీ అధిక స్థానాల్లో గెలుస్తుందట. అలాగే.. కర్నూలులోనూ టీడీపీ అధిక స్థానాల్లో గెలుచుకుంటుందట. కేవలం రాయలసీమలో కడప జిల్లాలో మాత్రమే వైసీపీ ఎక్కువ స్థానాల్లో గెలుస్తుందని రఘురామ సర్వే చెబుతోంది. గుంటూరు, వైజాగ్, గోదావరి జిల్లాలలో జనసేన ప్రభావం ఉంటుందట. ఏది ఏమైనా.. రఘురామ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని అంటున్నాడు. సీఎం జగన్ ఎన్ని పథకాలు పెట్టినా.. పేదల కోసం ఎన్ని సంక్షేమ పథకాలు పెట్టినా వాటి పట్ల ప్రజలు సంతృప్తికరంగా లేదని చెబుతున్నారు.