Raghurama Krishnam Raju : జగన్ తో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారు.. టీడీపీతో గెలిచి జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడేంటి..?
ప్రధానాంశాలు:
Raghurama Krishnam Raju : జగన్ తో రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడారు.. టీడీపీతో గెలిచి జగన్ కి షేక్ హ్యాండ్ ఇచ్చాడేంటి..?
Raghurama Krishnam Raju : ఏపీలో రాజకీయాలు పూటకు ఒక రంగు మారుతున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఓ పక్క కొత్త ప్రభుత్వం తమ పరిపాలనతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే.. మరోపక్క వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకోవాలని చూస్తుంది. ఈ తరుణంలో ఏపీలో అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యయి. సోమవారం నుంచి జరుగుతున్న ఈ అసెంబ్లీ సెషన్స్ లో వైసీపీ అభ్యర్ధులు కూడా పాల్గొన్నారు.ఇక అసెంబ్లీ హాల్ లో వైఎస్ జగన్ కనిపించగానే టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు వెళ్లి పలకరించి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు వైఎస్ జగన్ మీద రకరకాల వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఆయన్ను అరెస్ట్ చేయించిన తీరు అంతా తెలిసిందే. అందుకే పార్టీ నుంచి బయటకు వచ్చి టీడీపీ తీర్ధం పుచ్చుకునాడు.
Raghurama Krishnam Raju మాటామంతి వరకేనా వెనక ఇంకేమైనా ఉందా..
అసెంబ్లీలో జగన్ ని కలిసి రఘురామకృష్ణరాజు ఆప్యాయంగా పలకరించిన విధానం కొత్త డౌట్లకు తెర తీస్తుంది. నిన్న మొన్నటిదాకా జగన్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లడిన ఈయన ఇలా అసెంబ్లీలో జగన్ ని పలకరించి మాటా మంతి కలపడం అటు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా షాక్ ఇచ్చింది.
ఇక అసెంబ్లీ మొదలైన కొద్దిసేపటికే వైసీపీ అభ్యర్ధులు బయటకు వెళ్లిపోయారు. గవర్నర్ స్పీచ్ లో గత ప్రభుత్వం చేసిన పనుల గురించి చెబుతుండగా మధ్యలోనే హాల్ నుంచి బయటకు వెళ్లారు వైసీపీ అభ్యర్ధులు. ఇటు రఘురామకృష్ణరాజు కూడా అసెంబ్లీలో ప్రతిపక్షం లేకపోతే బాగోదని.. రోజు సభకు రావాలని కోరా అంతకుమించి ఏం లేదని మీడియాతో చెప్పారు. కానీ జగన్ రఘురామకృష్ణరాజు పలకరింపులు కొత్త అనుమానాలకు దారి తీస్తుంది. జగన్ మీద రఘురామ కృష్ణ రాజు కోపం అంతా ఇప్పుడు కనిపించలేదు. నేటి సీన్ తో రఘురామ కృష్ణ రాజు అధికార పార్టీకి తలనొప్పులు తెచ్చేలా ఉన్నాడని అర్ధమవుతుంది.