Chandrababu : చంద్రబాబుపై రాళ్ల దాడి గుట్టు బయటపెట్టిన టీడీపీ సీనియర్ నేత?
Chandrababu : ప్రస్తుతం ఏపీలో తిరుపతి ఉపఎన్నిక కన్నా ఎక్కువ ట్రెండింగ్ లో ఉన్న టాపిక్…. సోషల్ మీడియాలో వైరల్ అయిన టాపిక్.. అచ్చెన్నాయుడు వీడియో. పార్టీలేదు… బొక్కా లేదు… ఈ నెల 17 తర్వాత పార్టీయే ఉండదు. మనకేంటి బాధ… పార్టీ ఏమన్నా మనదా? లోకేశ్ మంచిగా ఉంటే మనకు ఇవన్నీ బాధలు ఎందుకు? పార్టీ ఇలా ఎందుకు తయారవుతుంది? అంటూ అచ్చెన్నాయుడు ఓ వీడియోలో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో రచ్చ రచ్చ అయింది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది.
నిజానికి ఆ వీడియో తీసింది టీడీపీకే చెందిన ఓ నేత ఆకుల వెంకటేశ్వరరావు. ఆయన జూబ్లీహిల్స్ ఏరియాకు చెందిన నేత. ఆయనకు జూబ్లీహిల్స్ ఓ ఉన్న ఓ ల్యాండ్ విషయంలో చంద్రబాబు, లోకేశ్ పై ఆయన నిప్పులు చెరిగారు. తన ల్యాండ్ ను కబ్జా చేశారని…. కబ్జా చేసిన వ్యక్తి చంద్రబాబుకు దగ్గరి వ్యక్తి అని… అందుకే ల్యాండ్ విషయంలో చంద్రబాబ కూడా తనను పట్టించుకోవడం లేదని… అసలు లోకేశ్ అయితే తనను, తన ఫ్యామిలీని సూసైడ్ చేసుకోవాలని చెప్పారని వాపోయారు.
Chandrababu : నేను షర్ట్ విప్పి చంద్రబాబు మీద వేశా… కానీ రాళ్లు దాడి మాత్రం జరగలేదు
తన బాధను చంద్రబాబును పట్టించుకోవడం లేదని… తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రబాబు దగ్గరికి వెళ్లిన ఆకుల వెంకటేశ్వరరావు.. షర్ట్ విప్పి తన నిరసనను వ్యక్తం చేశారు. నేను చంద్రబాబు దగ్గరికి వెళ్లి షర్ట్ విప్పి.. నేను సర్వం కోల్పోయాను అని అన్నాను… గట్టిగా అరిచాను కానీ నామాటను చంద్రబాబు పట్టించుకోలేదు. ఇంకా గట్టిగా అరిచాను. బట్టలు విప్పి షర్ట్ విసిరాను. నేను షర్ట్ విప్పినప్పుడు పక్కనే ఉన్నఅచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు పట్టించుకోలేదు. దీంతో వెంటనే చంద్రబాబు దగ్గరికి వెళ్లి.. ఏంటి సార్ నా జీవితంతో ఆడుకుంటున్నాను. నన్ను నాశనం చేశారు. నా మొరను వినడం లేదు. మీ కొడుకేమో నా ఫ్యామిలీ మొత్తాన్ని సూసైడ్ చేసుకొమ్మని చెబుతున్నాడు. 30 సంవత్సరాలుగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు నన్ను రోడ్డు మీదికి లాగారు. ఆయనకు కోపం వచ్చేలా అడిగాను. ఆ తర్వాత ఏం మాట్లాడుకుండా.. చంద్రబాబు అక్కడి నుంచి వెళ్లిపోయి స్టేజ్ మీదికి ఎక్కేశారు. అక్కడ జరిగింది ఇదే. అక్కడ రాళ్ల దాడి జరగలేదు.. నేను కేవలం షర్ట్ విసిరేశాను అంతే. దానికి రాళ్ల దాడి అంటూ సృష్టించి.. నన్ను వైఎస్సార్సీపీ గుండాగా చిత్రీకరించారు.. అంటూ ఆకుల వెంకటేశ్వరరావు మీడియా ముందు వాపోయారు.