will TDP MLA from Gannavaram in the next election
TDP విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం పేరు చెప్పగానే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు పేరు గుర్తు రావాల్సిందే. టీడీపీ TDP లోనే రాజకీయ జీవితం మొదలుపెట్టిన అయ్యన్న ఆరు సార్లు నర్సీపట్నం నుంచి గెలిచారు. అయ్యన్న పోరాటానికి ఆయన వారసుడు చింతకాయల విజయ్ మద్ధతుగా కూడా ఎక్కువగానే ఉంది. విజయ్ సైతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉంటున్నారు. తండ్రికి సపోర్ట్‌గా ఉంటూ, పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లో జగన్ వేవ్ ఉన్నా సరే, నర్సీపట్నంలో టీడీపీ కొద్దిగా పోటీలో నిలబడగలిగింది. నర్సీపట్నం మున్సిపాలిటీలో మొత్తం 28 వార్డులు ఉంటే వైసీపీ 14 గెలుచుకుంటే, టీడీపీ TDP 12 గెలుచుకుంది. ఇక విజయ్ సైతం కౌన్సిలర్ గా గెలిచి, తన సత్తా చాటుకున్నారు.
TDP
ఈనేపథ్యంలో విజయ్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలోకి దిగడానికి సిద్ధమవుతున్నారు. 2019 ఎన్నికల్లోనే వారసుడుకు టిక్కెట్ ఇప్పించుకోవాలని అయ్యన్నపాత్రుడు చూశారు. కానీ చంద్రబాబు ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ అని చెప్పడంతో అయ్యన్నపాత్రుడు ఒక్కరే పోటీలోకి దిగారు. నర్సీపట్నం ఎమ్మెల్యేగా ఒకరు, అనకాపల్లి ఎంపీగా ఒకరు పోటీ చేయాలనుకున్న చంద్రబాబు ఇష్టపడలేదు.
TDP Leader Ayyanna Patrudu
2019 ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఆడారి ఆనంద్ వైసీపీలోకి వెళ్ళిపోయారు. దీంతో అనకాపల్లి పార్లమెంట్ సీటు ఖాళీగానే ఉంది. దీంతో ఈ పరిస్థితుల్లో చంద్రబాబు తమ ఫ్యామిలీకి రెండు సీట్లు ఎందుకు ఇవ్వరన్న ధీమా అయ్యన్నపాత్రుడులో ఉంది. వచ్చే ఎన్నికల్లో రెండు టిక్కెట్లకు ఛాన్స్ లేకపోతే అయ్యన్నపాత్రుడు రాజకీయాల నుంచి తప్పుకుని విజయ్‌కు కూడా టిక్కెట్ దక్కించుకోవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. మరి అయ్యన్న మాట ఏమేరకు చెల్లుతుందో వేచి చూడాల్సిందే.
Allu Family | మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ మూడో కుమారుడైన శిరీష్ ‘గౌరవం’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా…
Eye Care Tips | నేటి మారుతున్న జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ప్రజలు అధికంగా చక్కెరను తీసుకుంటున్నారు. తాజా…
Ramen noodles | జపాన్లోని ఈశాన్య యమగటా ప్రిఫెక్చర్లో జరిగిన ఒక తాజా పరిశోధన ప్రకారం, తరచుగా రామెన్ తినేవారికి మరణ…
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్తో సాగుతోంది.…
This website uses cookies.