
jabardasth naresh age is 22 years
Jabardasth Naresh: పొట్టోళ్లు గట్టోళ్లు అని పెద్దలు ఊరికే అనలేదు. ఎన్నో ప్రత్యక్షంగా చూసిన ఉదాహరణలతోనే ఈ సామెతని కనిపెట్టారు. ఇదే సామెత కొన్ని లక్షల మందికి ఆపాదించవచ్చు. అంగవైకల్యం ఉన్నదానికి ఆ లోపం తీర్చడానికి భగవంతుడు దానికి రెట్టింపు తెలివితేటలు ఇస్తుంటాడని ఇప్పటికే పలు సందర్భాలలో ఎంతో మందిని చూసే ఉంటాము. అలాంటి రేర్ పర్సనాలిటీ జబర్దస్త్ నరేష్ ది. జబర్దస్త్ నరేష్ చూడటానికి ఉంది మూడడుగులు లోపే అయినా సంచుల కొద్దీ పంచులతో చిచ్చరపిడుగులా రెచ్చిపోతున్నాడు. బుల్లితెర మీద ఇప్పుడు జబర్దస్త్ నరేష్ ఓ వెలుగు వెలుగుతున్నాడు. ప్రస్తుతం నరేష్ కి జబర్దస్త్ షోతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. మొదట్లో నరేష్ ని చూస్తే ఇతనిలో ఇంత టాలెంట్ ఉందా అని సందేహం కలగకమానదు.
Jabardasth Naresh age is 22years
కానీ గుంటూరు మిరపకాయ్ లా యమా ఘాటుగా ఉన్నాడు. అందుకే తను చేసే కామెడీ పేల్చే పంచులు తట్టుకోలేక పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ కిందపడి గిల గిలా కొట్టేసుకుంటున్నారు. ఎవరికైనా ఒక స్టైల్ ఉంటుంది. నరేష్ కి ఆ స్టైల్ ఉంది. ఏక సంతాగ్రహి అని వినే ఉంటారు. ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడాల్సిన పనిలేదు. ఒక్కసారి వింటే మళ్ళీ వినాల్సిన పనిలేదు. చేసేయడమే. అదే నరేష్ కి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. జబర్దస్త్ కోసం టీమ్ అందరూ స్కిట్స్ ప్రాక్టీస్ చేస్తుంటారు. ఒక్క నరేష్ తప్ప. తను మాత్రం ఒక్కసారి స్క్రిప్ట్ లో కాన్సెప్ట్ ఏంటి.. స్కిట్ స్టార్టింగ్ మిడిల్ ఎండింగ్ ఏంటి అనేది మాత్రమే గుర్తు పెట్టుకుని స్టేజ్‌పైనే పర్ఫార్మ్ చేస్తుంటాడు నరేష్. ఇది అందరికి ఉంటే టాలెంట్ కాదు. ఈ విషయాన్ని
భాస్కర్ కూడా చాలాసార్లు చెప్పాడు. మూడడుగులే ఉన్నా కానీ మిగిలిన ఆరడుగుల టీం లీడర్స్‌కు చెమటలు పట్టిస్తుంటాడు. తనలో ఉన్న కామెడీ టైమింగ్ అలాంటిది మరి. అయితే గత కొన్ని రోజులుగా ఈ నాటి నరేష్ వయసు ఎంత ఉంటుందనే విషయంలో ఆసక్తికరమైన చర్చలు సాగుతున్నాయి.
jabardasth naresh age is 22 years
దానికి సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు నరేష్ వయసెంతో చాలా మందికి తెలియదు. చూడ్డానికి చిన్నోడిలా ఉన్నా ఎప్పుడో ఓటు హక్కు కూడా వచ్చేసింది. వరంగల్ జిల్లా జనగాం దగ్గర్లోని అనంతపురం అనే ఊళ్లో పుట్టిన నరేష్ చిన్నప్పటి నుంచే ఎదుగుదల లోపంతో బాధ పడుతున్నాడు. అయితే ఇదే అతనికి వరమైంది. పదేళ్ల పిల్లాడిలా కనిపిస్తున్న నరేష్ వయసు మాత్రం 22 ఏళ్లు. కాస్త నమ్మడానికి కష్టమే అయినా నమ్మి తీరాల్సిందే. 1999 సంవత్సరంలో పుట్టిన నరేష్.. ఢీ షో జూనియర్స్‌కు వచ్చాడు. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ బయటే తిరుగుతూ సునామీ సుధాకర్ కంట్లో పడి చంటి టీంలో జాయిన్ చేసాడు. నరేష్ వయసు గురించి చాలా రోజులుగా చర్చ జరుగుతుంది. ఇప్పటివరకు ఏ షోలో కూడా తన వయసు గురించి ఓపెన్ కాలేదు నరేష్.
jabardasth naresh age is 22 years
అయితే మొదటిసారి జబర్దస్త్‌లోనే టంగ్ స్లిప్పయ్యాడు. ఇటీవల ఓ స్కిట్‌లో భాగంగా తన వయసు 22 అంటూ ఒప్పేసుకున్నాడు. హైపర్ ఆది స్కిట్ చేస్తున్నపుడు 22 ఏళ్ళుగా జిమ్ చేస్తున్నా అంటూ పొరపాటున అసలు వయసు చెప్పేసాడు నరేష్. ఆ టీం నుంచి బుల్లెట్ భాస్కర్ టీంలోకి వచ్చిన తర్వాత నరేష్ ఫేట్ మొత్తం మారిపోయింది. కొద్దికాలంలోనే స్టార్ కమెడియన్ అయిపోయాడు. ముఖ్యంగా తనదైన పంచులతో జనాలను ఆకట్టుకుంటున్నాడు నరేష్. నరేష్ వల్లే తమ టీంకు అంతమంచి పేరొచ్చిందని చెప్తుంటాడు భాస్కర్. ఒక్క టీంలోనే కాదు అందరి టీంలలో కనిపిస్తుంటాడు నరేష్. జబర్దస్త్ షోలోకి వచ్చిన తర్వాత సొంతూళ్లో ఇల్లు కూడా కట్టుకున్నాడు . సిటీలో కూడా ఫ్లాట్ తీసుకున్నాడు. ప్రస్తుతం నరేష్ ఒక్క జబర్దస్త్ మాత్రమే కాకుండా అన్ని ఛానెల్స్ షోలు చేస్తున్నాడు. ఉదయభానుతో కూడా గ్యాంగ్ లీడర్ షో చేసాడు.
ఇది కూడా చదవండి ==> గు.. అంటూ అనసూయ బూతు మాట.. షాకైన అభి,రోజా.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> పదిన్నర అయింది ఏం లేదా?.. రష్మిని నేరుగా అడేసిన సుధీర్.. వైరల్ వీడియో
ఇది కూడా చదవండి ==> ఎక్స్ ప్రెస్ హరిని లాగిపెట్టి కొట్టిన అషూ రెడ్డి! వీడియో
ఇది కూడా చదవండి ==> సమంత తల్లి కాబోతోందన్న సీక్రెట్.. అసలు విషయం ఇలా బయటపడిందా..!
Pawan Kalyan : ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ AP Deputy CM Pawan Kalyan లక్ష్యంగా సీపీఐ జాతీయ…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గత కొన్నేళ్లుగా పెను సంచలనం సృష్టించిన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు…
LPG Gas Cylinder Subsidy: దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడ్జెట్ 2026 సమయం దగ్గరపడుతోంది. ఫిబ్రవరి 1న…
Today Gold Rate 13 January 2026 : ప్రస్తుతం మార్కెట్లో బంగారం Today Gold price , వెండి…
Karthika Deepam 2 Today Episode : స్టార్ మా ప్రసారం చేస్తున్న కార్తీక దీపం 2 సీరియల్ జనవరి…
Bhartha Mahasayulaki Wignyapthi : మాస్ మహారాజ రవితేజ కొత్త Mass Raviteja సినిమా ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ పై…
Chandrababu Sankranthi Kanuka : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చేనేత కార్మికులకు సంక్రాంతి పండుగ వేళ కూటమి ప్రభుత్వం గొప్ప ఊరటనిచ్చింది. చేనేత…
Mahindra XUV 7 XO : భారత ఆటోమొబైల్ మార్కెట్లో ప్రియమైన SUVలలో ఒకటిగా ఉన్న మహీంద్రా XUV700, ఇప్పుడు…
This website uses cookies.