ఏలూరు ఘటనకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం.. నారా లోకేశ్ ఫైర్?
ఏపీలో ప్రస్తుతం అందరూ ఏలూరు గురించే మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే.. అక్కడి స్థానికులు ఉన్నట్టుండి మూర్చబోతున్నారు. ఇప్పటికే 150 మంది దాకా మూర్చవచ్చి పడిపోవడంతో వెంటనే స్పందించిన యంత్రాంగం సహాయక చర్యలు చేపట్టింది.
అయితే.. ఈ ఘటనపై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఏలూరులో ప్రజలంతా ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారని ఆయన ట్వీట్ చేశారు.
ఇప్పటికే 150 మంది అస్వస్థతకు గురయ్యారు. అందులో చాలామంది చిన్నారులు ఉన్నారు. వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే.. ఇక మిగితా ప్రాంతాల పరిస్థితి తలుచుకుంటనే ఆందోళనగా ఉంది. వెంటనే అస్వస్థతకు గురయిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. కలుషిత తాగునీరు దీనికి కారణమని ప్రాథమికంగా తేలింది. దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి.. అంటూ నారా లోకేశ్ ట్వీట్టర్ లో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ నిర్లక్ష్యం వలనే పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు ఒక్కసారిగా మూర్చ లక్షణాలతో పడిపోయారు,150 మంది అస్వస్థతకు గురయ్యారు,అందులో అధిక సంఖ్యలో చిన్నారులు ఉన్నారు.వైద్య శాఖ మంత్రి సొంత నియోజకవర్గంలోనే ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకపోతే(1/2) pic.twitter.com/foRRQQKdhL
— Lokesh Nara (@naralokesh) December 6, 2020
ఇక రాష్ట్రంలో ఉన్న మిగిలిన ప్రాంతాల పరిస్థితి తలచుకుంటేనే ఆందోళనగా ఉంది.వెంటనే అస్వస్థతకు గురైన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి.చిన్నారుల ఆరోగ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలి.కలుషిత తాగునీరు కారణమని ప్రాథమిక సమాచారం.దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి.(2/2)
— Lokesh Nara (@naralokesh) December 6, 2020