ChandraBabu : పిల్లల చదువు విషయంలో చంద్రబాబు జోకులు.. తెలుగు తమ్ముళ్లే విమర్శలు
ChandraBabu : ఏపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించడం జరిగింది. మాస్ కాపీయింగ్ కు.. పేపర్ లీకేజ్ కు పాల్పడుతున్న ఒకొక్కరిని ఏరి పారేస్తూ సీఎం జగన్ మోహన్ రెడ్డి పక్క రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలుస్తున్నారు. పదవ తరగతి పరీక్షలు అంటే సూచి రాతలు కాదు అని ప్రభుత్వం చెప్పకనే చెబుతూ సీరియస్ గా ఉండటంతో ఎంత మంది ఫెయిల్ అయ్యారో మనం చూస్తూనే ఉన్నాం. విద్యా వ్యవస్థను మెరుగు పర్చడంలో భాగంగా తాజాగా ప్రముఖ ఆన్ లైన్ టీచింగ్ సంస్థ బైజూస్ తో ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది.
ఒక్కొక్క విద్యార్థి బైజూస్ ఆన్ లైన్ మెటీరియల్ ను యాక్సెస్ చేసుకోవడంకు పాతిక నుండి ముప్పై అయిదు వేల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కాని ఏపీ ప్రభుత్వం ఉచితంగా ఆ బైజూస్ పాఠాలను పేద విద్యార్థులకు ఇచ్చేందుకు సిద్దం అయ్యింది. ఇది ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వంకు కూడా చేతనవ్వలేదు. ఇలాంటి ఒక అద్బుతమైన పనిని కూడా చంద్రబాబు నాయుడు గేలి చేస్తూ అవహేళన చేస్తూ మాట్లాడటం ఆయనే చెల్లింది. పిల్లల చదువుల విషయంలో ఇప్పటికే చేసిన రచ్చ చాలు. పదవతరగతి పిల్లల విషయంలో చేసిన పనితో తెలుగు దేశం పార్టీనే జనాలు విమర్శించారు.
ఇప్పుడు ఉచితంగా బైజూస్ సేవలను పేద విద్యార్థులకు ప్రభుత్వం ఇస్తానంటూ ఉంటే జై జూస్ కాదు.. జగన్ జూస్ అంటూ అవహేళన చేయడం ఏంటీ అంటూ చంద్రబాబు నాయుడు తీరును సామాన్య ప్రజల నుండి మొదలుకుని ఏకంగా ఆయన సొంత పార్టీ నాయకులు కూడా విమర్శిస్తున్నారు. మంచి చేసినప్పుడు పొడగకున్నా పర్వాలేదు కాని ప్రతి విషయాన్ని విమర్శించాల్సిన అవసరం లేదు అంటూ తెలుగు తమ్ముళ్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు విద్యార్థుల జీవితాలతో రాజకీయం చేయాలనే ప్రయత్నాలు మానుకుంటే బాగుంటుందని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.