TDP : మహానాడు’ మళ్లీ టీడీపీ పూర్వ వైభవం తెచ్చేనా?
TDP : ఒకప్పుడు వెలుగు వెలిగిన తెలుగు దేశం పార్టీ ఇప్పుడు ఏ పరిస్థితి ఎదుర్కొంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏపీలో జనాలు తెలుగు దేశం పార్టీని ఏ స్థాయిలో పక్కకు పెట్టారో 2019 ఎన్నికల్లో నిరూపితం అయ్యింది. తెలుగు దేశం పార్టీ మళ్లీ 2024 ఎన్నికలపై ఆశలు పెట్టుకుంది. కాని జనాలు 2019 కంటే మరింత వ్యతిరేకతతో తెలుగు దేశం పార్టీ పై ఉన్నారంటూ ఇటీవల ఒక సర్వేలో వెళ్లడి అయ్యింది. జనాలు తెలుగు దేశం పార్టీ ఒక బాధ్యతగల ప్రతిపక్షం గా కూడా విఫలం అయ్యిందని భావిస్తున్నారు. అందుకే 2024 లో మళ్లీ బుద్ది చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కార్యకర్తలు ఆశలు వదిలేసి పక్క వైపు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో మహానాడు పండుగ వచ్చింది. ఎన్టీఆర్ జయంతి సందర్బంగా భారీ ఎత్తున నిర్వహించే మహానాడు కార్యక్రమం కు ఈసారి ఎక్కువ సందడి కనిపించడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు పండుగ వాతావరణంలో ఒకప్పుడు మహానాడు జరుపుకునే వారు. కాని ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న మహానాడునే జనాలు పట్టించుకోవడం లేదు. ఇక నియోజక వర్గం స్థాయిలో జిల్లాల స్థాయిలో మహానాడును పట్టించుకుంటారా అన్నట్లుగా ఉంది.మహానాడు తో కార్యకర్తల్లో మళ్లీ ఉత్తేజం నింపాలని..
మరోసారి అధికారంలోకి వస్తామని వారికి నమ్మకం కలిగిద్దాం అంటూ చంద్రబాబు నాయుడు నాయకులతో చర్చించారని తెలుస్తోంది. మహానాడు వేదికగా మళ్లీ కార్యకర్తలను బకరాలుగా చేసి చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు లోకేష్ ప్రగాల్బాలు పలకనున్నారు. గతంలో మాదిరిగా ఈసారి వారి ప్రగల్బాలను నమ్మేందుకు కార్యకర్తలు సిద్దంగా లేరేమో అనిపిస్తుంది. టీడీపీకి పూర్వ వైభవం అనేది సాధ్యం కాకపోవచ్చు అంటూ టీడీపీ కార్యకర్తలు బలంగా నమ్ముతున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పటికే వయసు మీద పడ్డ వ్యక్తి అవ్వడం వల్ల యాక్టివ్ గా ఉండటం లేదు.. లోకేష్ గురించి చెప్పనక్కర్లేదు. పార్టీ మారితే తప్ప పరిస్థితి మారదేమో అంటూ టీడీపీ కార్యకర్తలు ఆలోచనలో ఉన్నారట.