YSRCP : టీడీపీ మైండ్ గేమ్స్.. వైసీపీకి నష్టం లేదు, లాభమే.!
YSRCP : పద్ధతిగా ఎన్నికల్లో పోటీ చేసి అధికార వైసీపీని ఎదుర్కోవాల్సింది పోయి, తెరవెనుకాల మైండ్ గేమ్స్ ఆడుతోంది తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇదో చిత్రమైన పరిస్థితి. మైండ్ గేమ్స్ ఆడటంలో టీడీపీ అధినేత చంద్రబాబుకి సాటి ఇంకెవరూ రారు. అయితే, అవి మైండ్ లెస్ గెమ్స్.. అని 2019 ఎన్నికల్లోనే నిరూపితమయిపోయింది. 2014 నుంచి 2019 వరకు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విచ్చలవిడిగా పార్టీ ఫిరాయింపులకు దిగారు. తెలంగాణలో, పార్టీ ఫిరాయింపుల్ని రాజకీయ వ్యభిచారంగా చంద్రబాబు అభివర్ణిస్తూనే, ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఫిరాయింపుల్ని ఆయన ప్రోత్సహించిన వైనం అప్పట్లో అందర్నీ విస్మయానికి గురిచేసింది.
చంద్రబాబు నైజాన్ని జనం అర్థం చేసుకున్నారు కాబట్టే, టీడీపీకి దారుణమైన ఫలితాన్నిచ్చారు 2019 ఎన్నికల్లో. ఇప్పుడూ ఆ మైండ్ గేమ్స్ అలాగే కొనసాగుతున్నాయి. వైసీపీలో అసంతృప్త నేతలకు గాలమేసే పనిలో చంద్రబాబు బిజీగా వున్నారు. ఆశించిన పదవులు రాకపోవడం సహా, అనేక కారణాలతో వైసీపీలో ఒకింత నిస్తేజంగా వున్న కొందరు నేతలకు చంద్రబాబు గాలం వేస్తున్నారు. వారితో మైండ్ గేమ్స్ ఆడుతున్నారు కూడా. చంద్రబాబు మైండ్ గేమ్స్ పట్ల అధికార వైసీపీ అప్రమత్తమవుతోంది.

TDP Mind Game Politics Against YSRCP
అయితే, పార్టీ వ్యవహారాల్ని బాధ్యతగా నిర్వహించాల్సిన కీలక నేతలు, ఒకింత అసలత్వం ప్రదర్శించడంతో, చంద్రబాబు మైండ్ గేమ్స్ కొంతవరకు వర్కవుట్ అవుతున్నట్లుగానే భావించాలి. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేయకుండా, ‘చిత్తశుద్ధి, నిజాయితీ, సైద్ధాంతిక విలువలు..’ అంటూ ఏవేవో చెప్పిన టీడీపీ, మైండ్ గేమ్స్‌ని ఏ నైతికతకు నిదర్శనంగా చెప్పుకుంటుంది.? అయితే, ఈ మైండ్ గేమ్స్ వల్ల చంద్రబాబు సాధించేదేమీ వుండదు. పైగా, పార్టీకి సంబంధించి ఎక్కడెక్కడ లూప్ హోల్స్ వున్నాయో, వాటిని అధికార వైసీపీ యంత్రాంగం గుర్తించేందుకు వీలు కలుగుతుంది.