Chandrababu : అసెంబ్లీకి వెళ్దాం… చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి వ్యతిరేకత! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Chandrababu : అసెంబ్లీకి వెళ్దాం… చంద్రబాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుండి వ్యతిరేకత!

Chandrababu : త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే సంబంధిత మంత్రి తో మరియు అసెంబ్లీ కార్యదర్శి తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు మరియు తీసుకు రావాల్సిన కొత్త చట్టాలకు సంబంధించిన ఫైల్స్ కూడా సీఎం పరిశీలించారని సమాచారం అందుతోంది. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే […]

 Authored By himanshi | The Telugu News | Updated on :28 February 2022,7:00 am

Chandrababu : త్వరలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. అందుకోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే సంబంధిత మంత్రి తో మరియు అసెంబ్లీ కార్యదర్శి తో కూడా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. అసెంబ్లీలో జరగాల్సిన చర్చలు మరియు తీసుకు రావాల్సిన కొత్త చట్టాలకు సంబంధించిన ఫైల్స్ కూడా సీఎం పరిశీలించారని సమాచారం అందుతోంది. ఈ సమయంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మరియు ఎమ్మెల్యేలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈసారి అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుందో అని భయం వారిలో కనిపిస్తుంది.పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం అసెంబ్లీ సమావేశాలకు ఎట్టి పరిస్థితిలో వెళ్ళకూడదు అంటూ నిర్ణయించుకున్నాడు.

ఆయన గత అసెంబ్లీ సమావేశాల్లో తనకు ఘోర అవమానం జరిగింది అంటూ తనకు తానుగా భావించి మళ్లీ ముఖ్యమంత్రిగానే అసెంబ్లీలో అడుగు పెడతానంటూ శపథం చేశాడు. ఎమ్మెల్యేగా ఉండి ముఖ్యమంత్రిగానే అసెంబ్లీ లో అడుగు పెడతానంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని.. ఎమ్మెల్యేగా గెలిచిన చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా ఆయన నియోజక వర్గానికి మరియు ఆయన నియోజకవర్గ ప్రజలకు అన్యాయం చేసిన వాడు అవుతాడని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఎమ్మెల్యే లేదా ప్రజా ప్రతినిధి అన్నప్పుడు తన గొంతును, ప్రజల గొంతును అసెంబ్లీలో వినిపించాల్సిన అవసరం ఉంది. ప్రతిపక్షంగా ఉండి అధికార పక్షాన్ని నిలదీయాల్సి ఉంటుంది,

tdp mlas want to go assembly but chandrababu naidu don't want

tdp mlas want to go assembly but chandrababu naidu don’t want

కానీ అధికార పక్షాన్ని నిలదీయడానికి ధైర్యం దమ్ము లేకపోవడంతో ఇలా శపథాలు చేసి అసెంబ్లీ కి దూరంగా ఉంటున్నాడు అంటూ చంద్రబాబు నాయుడు పై విమర్శలు వచ్చే అవకాశం ఉంది. అందుకే తెలుగు దేశం పార్టీ నాయకులు ముఖ్యంగా ఎమ్మెల్యేలు ఎక్కువ శాతం మంది అసెంబ్లీకి హాజరయ్యే అవకాశం పరిశీలించాలి అంటూ విజ్ఞప్తి చేస్తున్నారట. చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాన్ని సొంత పార్టీ నాయకులు వ్యతిరేకిస్తుండడంతో ఇప్పుడు అధినేత ఆలోచనలో పడ్డాడు అనే సమాచారం అందుతోంది. మీరు కచ్చితంగా అసెంబ్లీకి వెళ్లాల్సిందే అని డిమాండ్ చేస్తే నేను రాను మీరు అసెంబ్లీ కి వెళ్ళండి అని చంద్రబాబు నాయుడు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్లేది ఎప్పుడో చూడాలి.

himanshi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది