KCR : దట్ ఈజ్ కేసీఆర్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఊహించని అభ్యర్థిని నిలబెట్టి.. కాంగ్రెస్, బీజేపీకి బిగ్ షాకిచ్చారు?
KCR : తెలంగాణలో మళ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఓవైపు నాగార్జున సాగర్ ఉపఎన్నిక.. మరోవైపు ఎమ్మెల్సీ ఎన్నికలు. వచ్చే నెల 14న ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. తెలంగాణలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడితో నేతలంతా బిజీ అయిపోయారు.
రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో.. పార్టీలు కూడా సమాయత్తమవుతున్నాయి. ఎన్నికల ప్రచారానికి దిగుతున్నాయి. తమ అభ్యర్థులను కూడా ప్రకటించారు. అభ్యర్థులను ప్రకటించడంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ముందుండగా… టీఆర్ఎస్ మాత్రం ఆచీతూచీ అడుగు వేసింది.
వరంగల్, ఖమ్మం, నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, బీజేపీలు ముందే తమ అభ్యర్థులను ప్రకటించాయి. టీఆర్ఎస్ పార్టీ.. ఇప్పటికే ఎమ్మెట్సీగా గెలిచిన.. పల్లా రాజేశ్వర్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చింది.
కానీ.. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నియోజకవర్గానికి మాత్రం టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించలేదు. దీంతో.. బీజేపీని దెబ్బ కొట్టడం కోసం.. ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ప్రొఫెసర్ నాగేశ్వర్ కు టీఆర్ఎస్ పరోక్షంగా మద్దతు ఇస్తుంది అని అంతా భావించారు. కానీ.. ఎవ్వరూ ఊహించని విధంగా.. కాంగ్రెస్, బీజేపీలకు సీఎం కేసీఆర్ షాకిచ్చారు.
KCR : మాజీ ప్రధాని పీవీ కుమార్తెకు టికెట్
అయితే.. ఎవ్వరూ ఊహించని అభ్యర్థిని హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల నుంచి ప్రకటించారు కేసీఆర్. మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహరావు కూతురుకు టికెట్ ఇచ్చారు. దీంతో కాంగ్రెస్, బీజేపీలకు దిమ్మతిరిగినంత పని అయింది. పీవీ కూతురు సురభి వాణీదేవిని సీఎం కేసీఆర్ హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల టీఆర్ఎస్ అభ్యర్థిగా కన్ఫమ్ చేశారట. చూద్దాం మరి.. కాంగ్రెస్, బీజేపీలకు చెక్ పెట్టడం కోసం పీవీ కూతురు రంగంలోకి దిగితే.. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు లభిస్తుందా? పీవీ కూతురుకు పట్టభద్రులు పట్టం కడతారా? లేదా? త్వరలో తెలుస్తుంది.