Modi – KCR : ప్రధాని మోదీ, సీఎం కేసీఆర్ మధ్య విభేదాలకు అసలు కారణమేంటి?
Modi – KCR : దేశంలో ఉండే ప్రధాని పట్ల రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులకు గిట్టకపోయినా ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని కార్యక్రమాలకు విధిగా హాజరుకావాలి. కానీ ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ మధ్య విభేదాల కారణంగా ప్రధాని కార్యక్రమాలకు వరుసగా కేసీఆర్ డుమ్మా కొడుతున్నారు. తెలంగాణలో బీజేపీ సాధించిన సంచలన విజయాల కారణంగా కావాలనే కేసీఆర్ ప్రధాని మోదీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారా.. లేదా ప్రధాని కార్యాలయమే కేసీఆర్‌ను దూరంగా ఉంచుతుందా అనే విషయం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గ మారింది.సాధారణంగా కేంద్రం, రాష్ట్రాల మధ్య సఖ్యత ఉంటే నిధుల విషయంలో ఢోకా ఉండదు.
రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టే కొత్త ప్రాజెక్టులు, కొత్త అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ప్రతి రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం అందించే సహకారం ముఖ్యం. అయితే తెలంగాణ, కేంద్ర ప్రభుత్వం విషయంలో భిన్న వైఖరి కనిపిస్తోంది. సీఎం కేసీఆర్ పదే పదే ప్రోటోకాల్ ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఇటీవల కరోనా ఫోర్త్ వేవ్‌పై ప్రధాని మోదీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ కార్యక్రమానికి కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ హాజరుకాలేదు. తాజాగా ఢిల్లీలో సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలో హైకోర్టు సీజేలు, రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ నిర్వహించిన కార్యక్రమానికి కూడా కేసీఆర్ డుమ్మా కొట్టారు. తెలంగాణ తరఫున మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మాత్రమే హాజరయ్యారు.అయితే ప్రధాని మోదీని పలుసార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ కలిసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

Telangana cm kcr bridges trust gap with pm narendra modi
Modi – KCR : ఆ ఉప ఎన్నికనే కారణమా..?
మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ కూడా హాజరయ్యారు. కానీ ఇటీవల తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉపఎన్నిక టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య అంతరాన్ని పెంచిందని పలువురు భావిస్తున్నారు. అప్పటినుంచే తరచూ కేంద్రంపై కేసీఆర్ ఆరోపణలు చేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. హైదరాబాద్‌లో ఇటీవల భారత్ బయోటెక్ సందర్శనకు ప్రధాని మోదీ రాగా కేసీఆర్ ఈ కార్యక్రమానికి రాకూడదని ప్రధాని కార్యాలయం సమాచారం ఇచ్చిందని టీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే కేసీఆర్ అనారోగ్యం కారణంగానే ఈ సమావేశానికి రావడం లేదని సమాచారం ఇచ్చారని బీజేపీ నేతలు కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. ఏదేమైనా ప్రధాని మోదీ కార్యక్రమాలకు కేసీఆర్ వరుసగా గైర్హాజరు కావడం అంతుచిక్కని రహస్యంగా మారింది.