KCR : హుజూరాబాద్ ఎన్నికలు అయ్యేంత వరకు ఆ మంత్రులు సేఫ్.. ఆ తర్వాత కేసీఆర్ ను ఎవ్వరూ ఆపలేరు?
KCR : సీఎం కేసీఆర్.. ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం హుజూరాబాద్ ఉపఎన్నిక మీద పెట్టారు. గత కొన్ని రోజుల నుంచి ఆయన ఎక్కువగా ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రజల మధ్య ఉంటున్నారు. ప్రజలతో మాట్లాడుతున్నారు. ఇటీవల వాసాలమర్రి ఊరికి వెళ్లి అక్కడ ప్రజలతో మాట్లాడి.. వాళ్లతో కలిసి భోం చేసి.. అక్కడ దళితబంధును ప్రారంభించి వచ్చారు. హుజూరాబాద్ ఉపఎన్నిక ప్రచారంలోనూ కేసీఆర్ రంగంలోకి దిగుతారని తెలుస్తోంది. హుజూరాబాద్ ఉపఎన్నికను ఎవరు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నా.. తీసుకోకపోయినా.. సీఎం కేసీఆర్ మాత్రం దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. అందుకే.. ఆయన ప్రస్తుతం మంత్రివర్గ విస్తరణను పక్కన పెట్టారు.
నిజానికి.. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడో జరగాల్సింది కానీ.. అప్పట్లో నాగార్జున సాగర్ ఉఫఎన్నిక వల్ల వాయిదా పడింది. ఆ ఎన్నికలు అయిపోయాక.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎపిసోడ్ నడిచింది. దాని నుంచి కోలుకునే సరికి.. ఇదిగో.. మళ్లీ హుజూరాబాద్ లో ఎన్నికలు వచ్చాయి. అందుకే.. హుజూరాబాద్ ఉపఎన్నిక తర్వాతే మంత్రి వర్గ విస్తరణ చేపట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.
KCR : మంత్రి కావాలని ఆశపడ్డ ఆ నేతలు ఇంకా కొన్నిరోజులు వెయిట్ చేయాల్సిందే
2018 లో రెండోసారి అధికారంలోకి వచ్చాక.. మంత్రి పదవి కోసం ఆశపడిన చాలామంది నేతలకు పదవి దక్కలేదు. దీంతో వాళ్లు మంత్రి వర్గ విస్తరణలో అయినా తమకు అవకాశం రాకపోతుందా? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. మంత్రి వర్గ విస్తరణ ఎప్పుడు జరుగుతుందా? అని తెగ ఎదురు చూస్తున్నారు. కానీ.. మధ్యలో జరిగిన కొన్ని ఘటనల వల్ల మంత్రి వర్గ విస్తరణ లేట్ అవుతోంది. మంత్రి పదవి కోసం ఆశగా ఎదురు చూస్తున్న కొందరు సీనియర్ నేతలు ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయక తప్పదు.
అలాగే.. మంత్రి వర్గ విస్తరణ సమయంలో.. కొందరు మంత్రులను తమ పదవి నుంచి సీఎం కేసీఆర్ తొలగిస్తారని వార్తలు వస్తున్నాయి. అందరు కాదు కానీ.. కొందరు మంత్రులను అయితే ఆ పదవి నుంచి తప్పించాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారట. అయితే.. వాళ్లు ఎవరు అనేదానిపై క్లారిటీ లేకున్నా.. మంత్రి వర్గ విస్తరణ లేట్ అవుతున్నా కొద్దీ.. హమ్మయ్య.. తమ పదవి ఇంకా కొన్ని రోజులు ఉంటుంది.. అని కొందరు మంత్రులు సంతోషంగా ఉంటున్నారట. మంత్రివర్గ విస్తరణ ఎంత లేట్ అయితే.. తమకు అంత మేలు అని అనుకుంటున్నారట. చూద్దాం మరి.. మంత్రి వర్గ విస్తరణను కేసీఆర్ ఎప్పుడు చేపడతారో.. ఎవరి పదవి ఊడుతుందో.. ఎవరికి పదవి దక్కుతుందో.