KCR – Modi : బ్రేకింగ్ : మోడీని కలవబోతోన్న కెసిఆర్ !
KCR – Modi : ఎలాగైనా తన కూతురును కాపాడుకోవాలి అని తెలంగాణ సీఎం కేసీఆర్ తెగ తాపత్రయపడుతున్నారు. అందులో భాగంగానే కవితను అరెస్ట్ చేయగానే.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలపాలని, బీజేపీ ప్రభుత్వ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. మరోవైపు మద్యం కుంభకోణంలో సీఎం కేసీఆర్ ఏకంగా ప్రధాని మోదీనే కలవాలని భావిస్తున్నారట. ఎందుకంటే.. ఈ కేసులో కవిత అరెస్ట్ ఖాయం అని స్పష్టం అవుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీని కలిసే చాన్స్ ఉందని అంటున్నారు. ఇదివరకు కూడా ఒకసారి సీఎం కేసీఆర్..
ప్రధాని మోదీని కలిసేందుకు ఢిల్లీ వెళ్లారు. యూపీలో ములాయంసింగ్ యాదవ్ అంత్యక్రియలకు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్లారు సీఎం. అప్పుడు తన కూతురు కవిత కూడా తన వెంటే ఉంది. ఢిల్లీలోనే వారం రోజులు ఉన్నారు కేసీఆర్. కానీ.. అప్పుడు ప్రధానిని కలవడం కోసమే కేసీఆర్.. ఢిల్లీలో ఉన్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ.. అప్పుడు ప్రధాని అపాయింట్ మెంట్ దొరకలేదు. అప్పుడే ప్రధాని అపాయింట్ మెంట్ దొరికి ఉంటే.. ఢిల్లీ మద్యం కేసు నుంచి తన కూతురును తప్పించాలని సీఎం కేసీఆర్ భావించారు.
KCR – Modi : దొరకని ప్రధాని అపాయింట్ మెంట్
కానీ.. కుదరలేదు. కావాలని బీజేపీ పెద్దలు సీఎం కేసీఆర్ ను పక్కన పెట్టారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇప్పుడు అదే కేసు.. కవితతో పాటు సీఎం కేసీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుండటంతో చేసేది లేక మరోసారి ప్రధానిని కలవాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారట. దాని కోసమే ఢిల్లీ వెళ్లాలని అనుకుంటున్నారట. ఇప్పటికే కవిత ఈడీ విచారణ కోసం ఢిల్లీ వెళ్లారు. తాను కూడా ఢిల్లీ వెళ్లి ప్రధాని అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఈసారైనా కేసీఆర్ కు ప్రధాని మోదీ అపాయింట్ మెంట్ దొరుకుతుందో లేదో?