Good News : సరిగ్గా ఎన్నికల టైంలో తెలంగాణ ప్రజలకు శుభవార్త చెప్పిన.. ప్రభుత్వం..!!
Good News : ప్రస్తుతం తెలంగాణ Telangana లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశాలలో భాగంగా పౌరసరఫరాలు, బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి గంగుల కమలాకర్ కీలక ప్రకటన చేశారు. మేటర్ లోకి వెళ్తే పేదలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు స్పష్టం చేశారు. అర్హులైన పేదలందరికీ త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు గతంలోనే ప్రభుత్వం ప్రకటన చేయడం జరిగింది.ఈ క్రమంలో పేద ప్రజల నుంచి భారీ ఎత్తున దరఖాస్తులు కూడా ఆహ్వానించింది. అయితే కొత్తగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించిన అధికారులు ఇంటికి వెళ్లి వివరాలు సేకరించడం జరిగింది.
అయితే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఇప్పటివరకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేయలేదు. మరోపక్క ప్రజలు రేషన్ కార్డు అందక నష్టపోతున్నారు. రేషన్ సరుకులు తీసుకునే అర్హత ఉన్న కార్డు లేకపోవడంతో… అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో రేషన్ కార్డులు జాప్యం పై ప్రతిపక్షాలు ఎప్పటినుంచో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి. త్వరగా కార్డులు జారీ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో త్వరలో పేదలకు కొత్త రేషన్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ప్రకటించడంతో… దరఖాస్తుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇవ్వడం జరిగిందని తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు గంగుల కమలాకర్ లెక్కలు బయటపెట్టారు. ఇంకా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.9 కోట్ల మందిని పేదలుగా కేంద్రం గుర్తించి రేషన్ అందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వ రేషన్ కార్డులు 95 లక్షల మందిని కవర్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో 281 బీసీ సంక్షేమ రెసిడెన్షియల్ విద్యాసంస్థలలో డిజిటల్ క్లాస్ రూంలను స్టార్ట్ చేసినట్లు పేర్కొన్నారు.