KCR Govt: ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తుంటే.. మీకు ఆదాయమే ముఖ్యమా? కేసీఆర్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన హైకోర్టు?
KCR Govt : ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తన పంజాను విసురుతోంది. తెలంగాణలోనూ కరోనా వ్యాప్తి విపరీతంగా ఉంది. కరోనా కేసులు తెలంగాణలో రోజురోజుకూ పెరుగుతున్నాయి. మరణాల రేటు కూడా పెరుగుతోంది. చాప కింద నీరులా కరోనా విస్తరిస్తోంది. అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నా కూడా కరోనా మహమ్మారి మాత్రం ప్రజలను వదలడం లేదు. కరోనా వ్యాప్తి నియంత్రణలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరిగ్గా లేదంటూ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు… కేసీఆర్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. కరోనా వ్యాప్తిని చూసి కూడా మీకు అర్థం కావడం లేదా? మీరు కరోనా కేసులు పెరుగుతుంటే చూస్తూ కూర్చుంటున్నారా? అంటూ తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు నిప్పులు చెరిగింది.

telangana high court on telangana govt over corona cases
రాష్ట్రంలో జనసంచారాన్ని తగ్గించే విధంగా ప్రణాళికలు ఎందుకు రూపొందించడం లేదు. అటువంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు… థియేటర్లు, బార్లలో రద్దీని తగ్గించేందుకు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు వాటి నిర్వహణపై ఎందుకు నియంత్రణ పాటించడం లేదు. మద్యం దుకాణాలు, బార్లు, పబ్ ల నిర్వహణే మీకు ముఖ్యమా? ప్రజల ప్రాణాలంటే మీకు లెక్కలేదా? అంటూ హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
KCR Govt : మీరు కరోనా నియంత్రణకు చర్యలు తీసుకుంటారా? లేక కోర్టు ఆదేశాలు ఇవ్వాలా?
కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎటువంటి చర్యలను తీసుకోవడం లేదని స్పష్టం అయింది. అందుకే… ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా? లేదా కోర్టును ఆదేశాలు ఇవ్వమంటారా? అంటూ కోర్టు ప్రశ్నించింది. కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ చేపట్టిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం సమర్పించిన నివేదికలో కనీస వివరాలు కూడా లేవని కోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.
48 గంటల్లోగా ప్రభుత్వం కరోనా నియంత్రణ కోసం చర్యలు తీసుకోవాలని…. లేదంటే తామే ఆదేశాలు ఇస్తామని హెచ్చరించిన కోర్టు.. రెండు రోజుల్లో కరోనా స్టేటస్ రిపోర్టును ఇవ్వాలంటూ ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి, హెల్త్ డైరెక్టర్ ను ఆదేశించింది. ఈనెల 23న సంబంధిత అధికారులు విచారణకు హాజరు కావాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.