Telangana Jobs : తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల… ఎలా అప్లై చేయాలంటే….!
ప్రధానాంశాలు:
Telangana Jobs : తెలంగాణలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల... ఎలా అప్లై చేయాలంటే....!
Telangana Jobs : తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త. తాజాగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. మరి ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాలు కోసం ఈ కథనాన్ని పూర్తిగా చదవండి …
Telangana Jobs : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…
ఈ భారి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేట నుండి విడుదల కావడం జరిగింది.
Telangana Jobs : ఖాళీలు…
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 32 పర్మినెంట్/ కాంట్రాక్ట్/ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వాటిలో
Telangana Jobs : డిసెక్షన్ హాల్ అటెండెన్స్..
స్టోర్ కీపర్ కం క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్…
డేటా ఎంట్రీ ఆపరేటర్..
ల్యాబ్ అటెండెన్స్..
బుక్ బేరర్ లేదా సబర్డినేట్ స్టాప్…
ఆఫీస్ సబార్డినేట్..
రికార్డు అసిస్టెంట్..
థియేటర్ అసిస్టెంట్..
టైపిస్ట్ కం డేటా ఆపరేటర్.. వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు…
విద్యార్హత…
నోటిఫికేషన్ లో విడుదల చేసిన పోస్టుల ప్రకారం 10th ,degree , డిప్లమా వంటి విద్యార్హతలు కలిగి ఉండాలి.
జీతం…
ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.15,600 నుండి రూ.19,500 వరకు జీతం ఇవ్వబడుతుంది.
వయస్సు…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 సంవత్సరాల నుండి గరిష్టంగా 45 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
పరీక్ష విధానం…
ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష నిర్వహించరు.
రుసుము…
ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు రూ.200 దరఖాస్తు ఫీజ్ గా చెల్లించాల్సి ఉంటుంది.
ఎలా అప్లై చేయాలంటే…
ఈ ఉద్యోగాలకు ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మీరు అధికారిక నోటిఫికేషన్/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి నోటిఫికేషన్ చదువుకున్న తర్వాత అర్హత ఉంటే అప్లికేషన్ ఫోర్మ్ పూరించి, సంబంధిత పత్రాలను జత చేసి ప్రిన్సిపల్ కార్యాలయం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నారాయణపేటకు పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా డైరెక్ట్ మెయిల్ ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు.