Chandrababu : చంద్రబాబు కమ్ బ్యాక్ పిలుపు పెద్ద జోక్..!
Chandrababu : తెలుగు దేశం పార్టీ నుండి పదుల సంఖ్యలో నాయకులు.. మాజీ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రులు.. మాజీ ఎంపీలు ఇంకా కింది స్థాయి నాయకులకు కార్యకర్తలు ఇతర పార్టీల్లోకి వెళ్లారు. ఇతర పార్టీలోకి వెళ్లిన నాయకులు వెళ్లే సమయంలో తీవ్ర విమర్శలు చేస్తూ.. తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడును మరియు ఆయన తనయుడు లోకేష్ ను తీవ్రమైన పదజాలంతో తిట్టిన వారిని కూడా మళ్లీ పార్టీలోకి రప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ కమ్ బ్యాక్ అనే ఒక ప్రోగ్రాం ను షురూ చేసిందట. అందులో భాగంగా టీడీపీని వీడిన వారితో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
టీడీపీని గతంలో వీడి ఇప్పుడు పక్క పార్టీలో ఉన్న వారిని చంద్రబాబు నాయుడు టార్గెట్ చేశారు. పక్క పార్టీలో జాయిన్ అయిన మాజీ తెలుగు దేశం పార్టీ నాయకులు ఒక వేళ హ్యాపీగా లేకుంటే కమ్ బ్యాక్ పిలుపుకు ముందుకు వస్తారు. కాని పక్క పార్టీలో అన్ని సౌకర్యాలు ఉండి.. ముఖ్యంగా టీడీపీలో కంటే మంచి గౌరవం లభిస్తున్నప్పుడు ఎందుకు మళ్లీ టీడీపీలోకి రావాలి అంటూ ప్రశ్నిస్తున్నారు. తెలుగు దేశం పార్టీలో కొందరి మాట మాత్రమే చెల్లుతుంది.. వారి వల్ల తాము ఇబ్బందులు పడ్డాం.. గౌరవం లేదు అంటూ చాలా మంది ఇప్పటికి బయటకు వస్తున్నారు. నిన్న కూడా దివ్య వాణి బయటకు వెళ్లి పోయింది.
అలాంటి టీడీపీ కమ్ బ్యాక్ పోగ్రాం పెట్టడం హాస్యాస్పదంగా ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగు దేశం పార్టీ మాజీ నాయకులను మళ్లీ రప్పించుకోవడం అనేది చంద్రబాబు నాయుడుకు అసాధ్యం. అసలు ఉన్న వారినే కాపాడుకోలేని చంద్రబాబు నాయుడు కమ్ బ్యాక్ పిలుపు ను ఇవ్వడం విడ్డూరంగా ఉంది.. చంద్రబాబు నాయుడు పెద్ద జోక్ వేసినట్లుగా కమ్ బ్యాక్ పిలుపు ఉందంటూ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నుండే కాదు బీజేపీ నుండి కాని మరే పార్టీ నుండి కాని తెలుగు దేశం పార్టీ లోకి వెళ్లే అవకాశం లేదు. 2024 లో కూడ అధికారంలోకి రాలేని టీడీపీని ఎందుకు ఎన్నుకోవడం అని చాలా మంది అభిప్రాయంతో ఉన్నారు.