Telugu News Channels : తెలుగు న్యూస్ ఛానల్స్ లో 90% ఛానల్స్ నష్టాల్లో ఉన్నాయి.. ఆ 10% ఛానల్స్ ఇవేనట..!!
Telugu News Channels : తెలుగు లో ఎన్ని న్యూస్ ఛానల్ ఉన్నాయో లెక్కించడం సులభమేం కాదు. చాలా మంది కి తెలియని న్యూస్ ఛానల్ లో చాలానే ఉన్నాయి. తెలుగు న్యూస్ ఛానల్ అనగానే రెండు మూడు న్యూస్ చానల్స్ పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అంతకు మించి తెలియని పేర్లు చాలానే ఉన్నాయి. వాటిలో ఎక్కువ శాతం నష్టాల్లో నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. సుదీర్ఘ కాలం పాటు నెంబర్ వన్ స్థానం లో నిలిచిన టీవీ9 ఈ మధ్య కాలంలో నెంబర్ 2 పడి పోయింది. ఎన్టీవీ ప్రస్తుతం తెలుగు న్యూస్ చానల్స్ లో నెంబర్ వన్ ఛానల్ గా ఉందంటూ బుల్లి తెర వర్గాల వారు మాట్లాడుకుంటున్నారు. ఇక తర్వాత స్థానంలో టీవీ5 ఉంటుంది.
టీవీ5 ఛానల్ రేటింగ్ చాలా తక్కువగా నమోదు అవుతున్నా కూడా ఆ రెండు ఛానల్ తర్వాత స్థానంలో నిలవడం వల్ల 3వ స్థానం ను సొంతం చేసుకుంది. మిగిలిన చానల్స్ ఏవి కూడా భారీ లాభాలతో దూసుకు పోతున్న దాఖలాలు అయితే లేవు. ప్రస్తుతానికి తెలుగు లో ఉన్న న్యూస్ చానల్స్ లో 10 శాతం న్యూస్ చానల్స్ మాత్రమే లాభాల్లో ఉన్నాయట. మిగిలిన 90% చానల్స్ నష్టాల్లోనే ఉన్నాయని అంటున్నారు. ఆ ఛానల్స్ లో ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వడం కూడా కష్టంగా ఉంటుందని చర్చ జరుగుతూ ఉంటుంది. రాజకీయ అవసరాల కోసం, వ్యాపార అవసరాల కోసం వాటిని ఆయా యాజమాన్యాలు నడిపిస్తున్నాయంటూ ప్రచారం జరుగుతుంది.
ఈ మధ్య కాలంలో ప్రతి పార్టీకి ఒక ఛానల్, ప్రతి వ్యాపార సంస్థకి ఒక ఛానల్ అన్నట్లుగా పరిస్థితి మారింది. అందుకే ఆ చానల్స్ ని జనాలు చూడడం లేదు. ఒకటి రెండు చానల్స్ మాత్రమే జనాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ముందు ముందు కొత్త ఛానల్స్ వచ్చినా కూడా జనాలు పట్టించుకుంటారని నమ్మకం లేదు అంటూ బుల్లి తెర వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా లో ఎక్కువ వార్తలు లభిస్తున్నాయి కనుక టీవీల్లో చూడాలని ఎక్కువ శాతం మంది భావించడం లేదు. అందుకే న్యూస్ ఛానల్ యొక్క రేటింగ్ దారుణంగా పడి పోయింది. తద్వారా ఆదాయం కూడా రావడం లేదని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.