TDP : టీడీపీని పాతరేస్తున్న తెలుగు తమ్ముళ్ళు.! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

TDP : టీడీపీని పాతరేస్తున్న తెలుగు తమ్ముళ్ళు.!

 Authored By prabhas | The Telugu News | Updated on :20 August 2022,7:30 am

TDP : తెలుగుదేశం పార్టీకి వేరే శతృవులే అవసరం లేదు. ఆ పార్టీని తెలుగు తమ్ముళ్ళే ముంచేస్తున్నారు. అర్థం పర్థం లేని రాజకీయాలతో అధినేత చంద్రబాబు, పార్టీని నాశనం చేసేస్తోంటే.. తండ్రికి తగ్గ తనయుడిగా టీడీపీని ముంచేయడానికి నారా లోకేష్ కూడా తనవంతు ప్రయత్నం చేస్తుండడం గమనార్హం. అధినేత, ఆయన తనయుడు అలా వుంటే.. పార్టీ కార్యకర్తలెలా వుంటారు.? సొంత పార్టీనే పాతరేసేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారం కావొచ్చు, మరో వ్యవహారం కావొచ్చు..

ఏ విషయంలోనూ టీడీపీకి స్పష్టత వుండడంలేదు. మాట మీద నిలబడటం అసలు టీడీపీ బ్లడ్డులోనే లేదని అనుకోవాలేమో.! ఓ రెండు మూడు నెలల క్రితం వరకూ ఓ మోస్తరుగా వున్న టీడీపీ గ్రాఫ్, ఈ మధ్య అనూహ్యంగా దిగజారిపోయింది. వాస్తవానికి, అధికార పక్షం పట్ల కొద్దో గొప్పో ప్రజా వ్యతిరేకత ఖచ్చితంగా వుండి తీరుతుంది. దాన్ని ప్రతిపక్షం క్యాష్ చేసుకోవాలి. అంటే, ప్రతిపక్షం బలం పుంజుకోవాలన్నమాట. కానీ, ఆ దిశగా టీడీపీ చేస్తున్నదేమీ లేదు. గోరంట్ల మాధవ్ వీడియో విషయాన్నే తీసుకుంటే, అది అసభ్యకరమైన వీడియో. మార్ఫింగ్ అని గోరంట్ల మాధవ్ ఆరోపిస్తున్నారు. సరే, అది నిజమా.? కాదా.? అన్నది వేరే చర్చ.

Telugu Tammullu Digging In Style

Telugu Tammullu Digging In Style

దాన్ని విచ్చలవిడిగా ప్రచారంలోకి తీసుకొచ్చింది టీడీపీ. చివరికి ఏమయ్యింది.? టీడీపీ అసభ్యకరమైన వీడియోలను షేర్ చేస్తోందన్న అపప్రధ మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇంతకన్నా దారుణం ఇంకేముంటుంది ఏ పార్టీకి అయినా. అత్యంత దారునంగా రివర్స్ అయ్యింది టీడీపీ గేమ్ ప్లాన్. అయినాగానీ, ‘తగ్గేదే లే..’ అన్నట్టు, ఇంకా ఇంకా టీడీపీ స్తాయిని దిగజార్చుకునేందుకు తెలుగు తమ్ముళ్ళు, తెలుగు మహిళలు ప్రయత్నిస్తున్నారు. సరిపోలేదు, పార్టీని వీలైనంత నాశనం చేసెయ్యాలని టీడీపీ నేతలంతా కలిసి కంకణం కట్టుకున్నట్టుంది పరిస్థితి. బహుశా ఇంతకు ముందెన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఈ స్థాయిలో రాజకీయంగా దిగజారి వుండదు. ఇట్ హ్యాపెన్స్ ఓన్లీ ఫర్ తెలుగుదేశం పార్టీ అన్నమాట.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది