Telugu Women New Record : న్యూజీలాండ్‌లో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగు యువతి.. 18 ఏళ్లకే ఎంపీగా రికార్డు..!
telugu girl new record : తెలుగు రాష్ట్రాలకు చెందిన యువతీ యువకులు విదేశాల్లో తమ సత్తాను చాటుతున్నారు. ఏ రంగమైనా తమ ప్రతిభతో ముందు వరుసలో నిలుస్తున్నారు. విద్యా, వైద్యం, వ్యాపారం, ఇంజినీరింగ్, నూతన ఆవిష్కరణల విషయంలో తగ్గేదేలే అంటూ మందుకు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే భారతీయులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, న్యూజీలాండ్, బ్రిటన్ ఇలా అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉన్నతమైన స్థానాలను భారతీయులు అధిరోహించిన విషయం తెలిసిందే. మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదేళ్ల తెలుగువాడు. హైదరాబాద్ వాసి. ప్రపంచంలోనే నంబర్ వన్ టెక్ దిగ్గజానికి తెలుగువాడు సీఈవో కావడం దేశానికే కాదు తెలుగు ప్రజలకు ఎంతో గర్వకారణం. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ యువతి న్యూజీలాండ్‌లో 18 ఏళ్లకే అరుదైన ఘనత సృష్టించింది. ఏకంగా ఆ దేశ పార్లమెంటు సభ్యురాలిగా ఎంపికై సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గడ్డం మేఘన (18) న్యూజీలాండ్ పార్లమెంటు నామినేటేడ్ పదవుల ఎంపికకు సంబంధించి సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంటు సభ్యురాలిగా ‘వాల్కటో’ ప్రాంతం నుంచి ఈమె నామినేట్ అయ్యారు. మేఘన తండ్రి గడ్డం రవికుమార్ ఉద్యోగ రీత్యా 2001లో తన సతీమణితో ఉషతో కలిసి న్యూజీలాండ్‌కు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మేఘన కూడా అక్కటే పుట్టిపెరిగింది. కేంబ్రిడ్జిలోని సెయింట్ పీటర్స్ ఉన్నత పాఠశాలలో స్కూలింగ్ పూర్తి చేసిన మేఘన చిన్న వయస్సులోనే ఎంత ప్రతిభను కలిగియుండేంది.
Telugu Women New Record : న్యూజీలాండ్ ఎంపీగా టంగుటూరు యువతి
న్యూజీలాండ్‌కు వలస వచ్చిన పలు దేశాల శరణార్థులకు కనీస వసతులు, విద్య, సౌకర్యాలు, ఆరోగ్యం అందించడంలో క్రియాశీలక పాత్రను పోషించేవారు. అనాథల కోసం తన ఫ్రెండ్స్‌తో కలిసి విరాళాలు సేకరించేది. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం డిసెంబర్ 16వ తేదిన పార్లమెంట్ సభ్యురాలిగా నామినేట్ చేసింది. ఈ విషయాన్ని ఆ ఏరియాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ టిమ్ నాన్ డిమోలిన్ ప్రకటించారు. మేఘన కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని వెల్లడించారు. ఫిబ్రవరిలో మేఘన ప్రమాణస్వీకారం ఉంటుందని తెలుస్తోంది.