YouTuber Wedding : తెలుగు యూట్యూబర్ పెళ్లికి నాలుగు కోట్ల రూపాయలు కట్నాలు.. వీడియో
YouTuber Wedding : సోషల్ మీడియాలో యూట్యూబ్ ద్వారా చాలామంది డబ్బులు సంపాదిస్తారని అందరికీ తెలుసు. రకరకాల కంటెంట్ తో వీడియోలు చేస్తూ ఉంటారు. ట్రావెలింగ్, కుకింగ్, ఎడ్యుకేషన్, ఉద్యోగాలు, రాజకీయాలు, భక్తి, హెల్త్ టిప్స్, వైద్యం… టెక్నికల్ చానల్స్ ఈ రకంగా యూట్యూబ్ ద్వారా సొంతంగా చానల్స్ పెట్టుకుని సంపాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అయితే యూట్యూబ్ లో తెలుగులో “క్రియేటివ్ థింక్స్” కి చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పల్లెకి సంబంధించి ఇంకా రకరకాల విషయాలు గురించి చాలా సరదాగా ఈ ఛానల్ నిర్వాహకులు చెప్పి మంచి అభిమానం సంపాదించాడు.
తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ వ్యక్తి ఇటీవల పెళ్లి చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సబ్స్క్రైబర్స్ మొత్తం అందరు కలిపి దాదాపు నాలుగు కోట్లకు పైగానే కట్నాలు పంపటం సంచలనంగా మారింది. ఈ ఛానల్ నిర్వాహకుడు వ్లాగ్స్, షార్ట్ ఫిల్మ్, వీడియోలు చేస్తూ.. మంచి గుర్తింపు సంపాదించాడు. ఇటీవల తన పెళ్లి వీడియోని తన యూట్యూబ్ ఛానల్ లో పోస్ట్ చేశాడు. తమని ఆశీర్వదించాలని కోరడం జరిగింది. ఈ క్రమంలో నూతన దంపతులకు సబ్‌స్క్రైబర్స్ ఆశీర్వాదం తెలిపి.. కట్నాలు పంపించారు.

telugu YouTuber Wedding For Dowry of 4 crore rupees
ఈ మొత్తం సుమారు రూ.4 కోట్లకు పైగా ఉండటం సంచలనంగా మారింది. మామూలుగా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎవరికైనా వ్యక్తికి సహాయం చేయడానికి కొంతమంది వీడియోలు చేస్తూ ఉంటారు. అదే సమయంలో వాళ్ళ అకౌంట్ కి ఎవరికి తోచిన వాళ్ళు డబ్బులు వేస్తూ ఉంటారు. ఈ తరహా లోనే “క్రియేటివ్ థింక్ అడ్వెంచర్” యూట్యూబ్ ఛానల్ కి సంబంధించి దాదాపు 23 వేల మందికి పైగా సబ్స్క్రైబర్స్ కట్నాలు పంపినట్లు.. నాలుగు కోట్లు వచ్చినట్లు నిర్వాహకుడు అధికారికంగా తెలియజేసి కృతజ్ఞతలు తెలిపారు.
