TDP : రోజు రోజుకీ తెలుగుదేశంలో టెన్షన్ పెరిగిపోతోంది..!
TDP : ప్రస్తుతం టీడీపీ పరిస్థితి ఏం బాగోలేదు. ఏదో ఒక పార్టీని పట్టుకొని వెళ్తేనే గెలిచే ఛాన్సులు చాలా తక్కువగా ఉన్నాయి. ఒంటరిగా పోటీ చేస్తే ఇక పార్టీ పరిస్థితి అగమ్య గోచరమే. అందుకే.. టీడీపీ ప్రస్తుతం వేరే పార్టీలతో పొత్తు కోసం వెంపర్లాడుతోంది. ప్రస్తుతం టీడీపీకి కనిపిస్తున్న ఒకే ఒక్క దారి జనసేన. నిజానికి.. అనధికారికంగా ఇప్పుడు టీడీపీ, జనసేన పొత్తులు ఖాయం అయిపోయినట్టే. టీడీపీతో పొత్తు విషయంపై జనసేన అధినేత కూడా ఇటీవలే క్లారిటీ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ పొత్తుల విషయం ఎన్నికలకు వారం ముందు మాత్రమే తెలుస్తుందన్నారు.
ఎలాగైనా వైసీపీని ఓడించడం కోసం ఏపీలోని ప్రతిపక్షాలన్నీ కలిసి పోరాటం చేయడానికి సిద్ధపడుతున్నాయి. 2019 లో ఒంటరిగా పోటీ చేసి అటు టీడీపీ ఇటు జనసేన రెండు బొక్కబొర్లా పడ్డాయి. మళ్లీ అదే తప్పు చేస్తే అది వైసీపీకి ప్లస్ అయి.. వీళ్లకు మైనస్ కానుంది. అందుకే.. ఈసారి టీడీపీతో పొత్తు పొట్టుకొని ఎన్నికల్లోకి వెళ్లాలని జనసేన కూడా భావిస్తున్నట్టు తెలుస్తోంది కానీ.. దానిపై ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇవ్వలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేనకు వచ్చే నష్టమేమీ లేదు. కానీ.. టీడీపీకే లేనిపోని లొల్లి. టికెట్ల విషయంలో పొత్తు ఉంటే తేడాలొస్తాయిని తెలుగు తమ్ముళ్లు టెన్షన్ పడుతున్నారట.
TDP : టీడీపీతో పొత్తు వల్ల జనసేనకు నష్టం లేదు
కొందరు ముందే తమ టికెట్స్ బుక్ కూడా చేసుకున్నారట. కానీ.. జనసేనతో పొత్తు అంటే.. కొన్ని సీట్లు జనసేనకు ఇవ్వాల్సి ఉంటుంది. అటువంటి సమయాల్లో టీడీపీ అధినేత ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అని తెలుగు తమ్ముళ్లు తెగ టెన్షన్ పడుతున్నారట. జనసేన కూడా గోదావరి జిల్లాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో పోటీ చేయాలని అనుకుంటున్నారు. కనీసం 70 నియోజకవర్గాల్లో పోటీ చేయాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి.. 70 నియోజకవర్గాలు జనసేనకు వెళ్తే.. ఆ నియోజకవర్గాల్లో ఆశావహులుగా ఉన్న వారి పరిస్థితి ఏంటి అనేది పెద్ద ప్రశ్నగా మారింది.