Gaming Phones : రూ.20వేల లోపు దొరికే బెస్ట్ గేమింగ్ మొబైల్స్ ఇవే..
Gaming Phones : మొబైల్స్ అంటే కేవలం ఫోన్లు మాట్లాడటానికి, వీడియోలు చూడటానికి, ఇంటర్నెట్ వాడటానికి మాత్రమే కాదు. అంతకుమించి జనాలు మొబైల్స్ ను వాడుతున్నారు. ఇక చాలామంది యూత్ మొబైల్స్ ను గేమింగ్ కోసం వాడుతుంటారు. మొబైల్స్ లో తమకు నచ్చిన గేమ్ ని డౌన్లోడ్ చేసుకొని ఆ గేంని ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే కొన్ని ఫోన్లు ఇలా గేమ్ లు ఆడే వారి కోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడి ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ.20వేల లోపు బెస్ట్ గేమింగ్ మొబైల్స్ కోసం చాలామంది వెతుకుతూ ఉంటారు. అలాంటి వారి కోసం రూ.20వేల లోపు దొరికే బెస్ట్ గేమింగ్ మొబైల్స్ లిస్ట్..
Gaming Phones : IQOO z6 5.. : గేమింగ్ కోసం బెస్ట్ మొబైల్ చూస్తున్న వారికి అతి తక్కువ ధరలో లభించే మొబైల్స్ జాబితాలో ఖచ్చితంగా మొదటి స్థానంలో ఈ మొబైల్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంతో నడిచే ఈ మొబైల్ మోడల్.. స్నాప్ డ్రాగన్ 696 ప్రాసెసర్ ను కలిగి ఉంటుంది. దీని ధర మార్కెట్ లో రూ.13,999గా ఉంది.
POCO X3 Pro : తక్కువ ధరలో గేమింగ్ మొబైల్ కోసం చూసే వారికి అందుబాటులో ఉన్న మరో మోడల్ ఫోన్ పోకో X3 ప్రొ. స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్ కలిగిన ఈ మోడల్.. 120Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంది. మొబైల్ మార్కెట్లో దీని ధర రూ.18,499గా ఉంది.
రియల్ మీ నోట్ 11 ప్రో : రియల్ మీ నుండి గేమింగ్ కోసం తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మొబైల్ ఏదైనా ఉంది అంటే అది ఇదే. రియల్ మీ నోట్ 11 ప్రో బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటుంది. హీలియో జి96 ప్రాసెసర్ కలిగి ఉండటం వల్ల మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ కలుగుతుంది. మార్కెట్లో దీని ధర రూ.18,999గా ఉంది.
రియల్ మీ 9 SE 5G : రియల్ మీ నుండి గేమింగ్ కోసం మరో మోడల్ చూడాలనుకుంటే అప్పుడు ఖచ్చితంగా రియల్ మీ 9 SE 5Gని చూడవచ్చు. స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్ తో వచ్చే ఈ మొబైల్ 144 Hz రీఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. మార్కెట్లో దీని ధర రూ.19,999గా ఉంది.