Wedding : పెళ్లి మండపం లో అల్లుడు కాళ్ళు కడగాల్సిన మావగారు.. చెప్పుతో కొట్టాడు !
Wedding : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతిదీ క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా పెళ్లి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. నిత్యం ఏదో ఒక వీడియో నెటిజన్లను ఆకర్షిస్తూ ఉంటుంది. తాజాగా ఓ పెళ్లి వీడియో అందరి దృష్టిని ఆకర్షించింది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో పెళ్లికూతురు తండ్రి తన అల్లుడిని చెప్పు తీసుకొని కొట్టాడు. పెళ్లి పీటలపై కూర్చున్న వరుడు తనకు కొత్త బైక్ కొనాలని మామను అడిగాడట. ఆ మాట విన్న వెంటనే పెళ్లికూతురు తండ్రి కాబోయే అల్లుడిని చెప్పుతో కొట్టాడు.
ఈ సంఘటన పెళ్లికి వచ్చిన బంధువులు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో పెళ్లికొడుకు పరువు పోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లుడిని మామ చెప్పుతో కొట్టడానికి ఏమైనా కారణాలు ఉన్నాయా లేదా బైక్ అడగటం వలన కొట్టాడా అనేదానిపై చర్చ నడుస్తుంది. అయితే పెళ్లి మండపంలో ఇరుకుటుంబ సభ్యులతో పాటు బంధువులు కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. పెళ్ళికొడుకును మామ చెప్పుతో కొట్టడమే కాకుండా నోటికి వచ్చినట్లు తిడుతూ అవమానించాడు. ఇక సోషల్ మీడియాలో కొత్త అల్లుడికి చెప్పుతో సన్మానం చేసిన మామ అంటూ పలు కామెంట్స్ చేస్తున్నారు.
ఈ ఘటన జరిగిన తర్వాత పెళ్లి ఆగిపోతుంది, పెళ్ళికొడుకు మండపం నుండి వెళ్ళిపోతాడు అని అక్కడ ఉండే వారంతా అనుకున్నారు కానీ పెళ్ళికొడుకు దెబ్బలు తిని కూడా వివాహం చేసుకోవడంతో అక్కడ అసలు ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కాలేదు. అంత జరిగినా అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఏముందని మామ చెప్పుతో దాడి చేయడానికి మరే ఇతర కారణాలు ఉన్నాయని అందరికీ సందేహాలు వస్తున్నాయి. బంధువులందరి ముందు మామ అలా కొట్టడం ఏంటా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.