టీడీపీ సీనియర్ నాయకుడు.. ప్రస్తుతం రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజకీయ భవితవ్యం పార్టీలో చర్చనీయాంశంగానే ఉంది. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మద్దతిచ్చేవారు.. ఒక విధంగా చర్చ చేస్తుంటే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వ్యతిరేకించే వర్గం.. మరో విధంగా వ్యాఖ్యలు చేస్తోంది. పార్టీలో సీనియర్ అయిన.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి.. ఆది నుంచి కూడా పార్టీ వాయిస్ వినిపించారు. సామాజికవర్గం పరంగా.. చంద్రబాబు వర్గమే అయిన.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి గతంలో ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. ఆ తర్వాత.. పార్టీ చంద్రబాబు ఆధీనంలోకి వచ్చాక కూడా చాన్నాళ్లు ఎదురు చూశారు. అన్నగారి మరణంతో గోరంట్ల బుచ్చయ్య చౌదరి బాబు వైపు మొగ్గు చూపారు.
ఇక, అప్పటి నుంచి పార్టీలో కీలకనేతగా ఉన్నారు.కానీ, పదవుల విషయంలో మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి కాలం కలిసిరావడం లేదు. గతంలో 2014లో నవ్యాంధ్రలో టీడీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి మంత్రి పదవిని ఆశించారు. అయితే.. అది దక్కలేదు. ఇక, ఇప్పుడు పార్టీ అధికారంలోకి వస్తుందనే అంచనాలపై సీనియర్లు సైతం నోరు విప్పడం లేదు. దీంతో ఒక సీనియర్‌గా పార్టీలో అయినా.. తనకు వాయిస్ వినిపించే అవకాశం ఇవ్వాలని.. తన నిర్ణయాలకు కూడా విలువ ఇవ్వాలని.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కోరుకుంటున్నారు. ఈ అసంతృప్తితోనే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఇటీవల రాజీనామా ప్రకటించి.. సంచలనం సృష్టించారు.
ఇదిలావుంటే.. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకివస్తే.. గోరంట్ల బుచ్చయ్య చౌదరిని రాజ్యసభకు పంపించాలనేది.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వర్గం చేస్తున్న డిమాండ్. అంటే.. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగాకానీ, ఎంపీగాకానీ, ప్రత్యక్ష రాజకీయాల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి పాల్గొనేది లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి ఇదే విషయాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఎప్పుడో స్పష్టం చేశారు. అయితే.. తన నియోజకవర్గంలో మాత్రం తన హవా సాగాలనేది గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యూహం. కానీ, ఓ వర్గం నాయకులు మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మీరే పదవి అయినా.. ఇచ్చుకోండి.. కానీ, నియోజకవర్గంలో మాత్రం గోరంట్ల బుచ్చయ్య చౌదరి హవా తగ్గించాల్సిందేనని పట్టుబడుతున్నారు.
దీంతో ఈ వర్గం.. గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజ్యసభ ఇచ్చినా తమకు అభ్యంతరం లేదని.. కానీ, నియోజకవర్గాన్ని మాత్రం తమ చేతుల్లో పెట్టాలనే డిమాండ్ చేస్తోంది. ఇటు రాష్ట్రంలోనూ.. అటు కేంద్రంలోనూ చక్రం తిప్పుతున్న ఈ కుటుంబం డిమాండ్‌పై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక పోతున్నారని అంటున్నారు సీనియర్లు.. ఇప్పుడీ పరిస్థితికి ఈ కుటుంబవైఖరే కారణమని తెలుస్తోంది. అచ్చెన్న సోదరి కూతురి కోసం .. సీనియర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరిని వదులుకోవాలా.. లేక గోరంట్ల బుచ్చయ్య చౌదరి డిమాండ్ కు మద్దతు పలకాలా అన్నదే ఇప్పుడు కీలకంగా మారింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.