Home » Exclusive » The Son Who Dug The Grave And Took Out The Dead Body For Mother Love
Exclusive

Mother dead body : అమ్మను విడిచి ఉండలేక.. సమాధిని తవ్వి డెడ్ బాడీని బయటకు తీసిన కొడుకు.. ఏం చేశాడంటే?

Authored By
mallesh
The Telugu News | Published on: December 29, 2021, 10:10 pm
Advertisement

mother dead body : మనిషికి పుట్టుక ఎంత సహజమో.. చావు కూడా అంతే. మధ్యలో ఉండే అనుబంధాలు, అప్యాయతలు, ప్రేమ వంటివి చావు నుంచి ఎవరినీ వేరు చేయలేవు. బతికి ఉన్నంత వరకే ఈ ప్రేమానురాగాలు మనతో ఉంటాయి. ఒక్కసారి చనిపోయాక కుటుంబసభ్యులు కొన్నాళ్లు గుర్తుచేసుకుంటూ ఏడుస్తారు. ఆ తర్వాత మరిచిపోతారు. మళ్లీ వచ్చే ఏడాది తమ వాళ్ల చనిపోయిన రోజును చిన్నపాటి పండుగలా జరుపుకుంటారు. ఒక్క ఇండియాలో మాత్రమే పుట్టకతో పాటు మరణాన్ని కూడా పండుగలా జరుపుతారు. విదేశాల్లో అయితే చనిపోయాక వారి సమాధుల వద్ద పూలను పెట్టి కాసేపు వారిని స్మరించుకుంటారు అంతే..

Advertisement

తల్లి ప్రేమ ఈ సృష్టిలోనే చాలా విలువైనది. ప్రైస్ లెస్.. తాజాగా వెలుగుచూసిన ఈ ఘటన దానిని మరోసారి గుర్తుచేసింది. తల్లిని మరువలేక ఓ వ్యక్తి ఏకంగా సమాధి నుంచి సగం కుళ్లిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. ఈ విషయం తెలిసి చుట్టుపక్కల వారు షాక్ అయ్యారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని పెరంబూరు జిల్లా కున్నం సమీపంలోని పరవై గ్రామంలో వెలుగుచూసింది.బాలమురుగన్ (38) అవివాహితుడు. తండ్రి పదేళ్ల కిందట మరణించడంతో అతని బాగోగులు తల్లి ముక్కాయి (65) చూసుకునేది. పది నెలల కిందట అనారోగ్యానికి గురై తల్లి మరణించడంతో మురుగన్ ఒంటరయ్యాడు.

son who dug the grave and took out dead body for mother love

Advertisement

mother dead body : తల్లిని మరచిపోలేక..

 బంధువులు ఎవరూ అతన్ని పట్టించుకునేందుకు ముందుకు రాలేదు. దీంతో తల్లి సమాధి వద్దకు వెళ్లి రోజు కూర్చునేవాడు. తనలో తనే మాట్లాడుకునేవాడు. ఓ రోజు సమాధి తవ్వి సగం కుళ్లిపోయిన డెడ్ బాడీని తీసుకొచ్చి ఇంట్లెపెట్టుకున్నాడు. ఓ రోజు సమీప బంధువు మురుగన్‌ను చూసేందుకు రాగా, ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో ఏంటది అని అడుగగా అతన్ని పింపంచివేశాడు. అనుమానంతో అతను పోలీసులకు కాల్ చేయగా వచ్చి చూస్తే తల్లి డెడ్ బాడీని గుర్తించారు. మతిస్థిమితం సరిగాలేక మురుగన్ ఇలా చేశారని పోలీసులు నిర్దారణకు వచ్చారు. మృతదేహాన్ని దహనం చేసేందుకు బంధువుల సాయం తీసుకున్నారు.

mallesh

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి