Brush | రాత్రి బ్రష్ చేయకపోతే ఏమవుతుంది… ఎలా ముప్పు వాటిల్లితుందో తెలుసా?
Brush | చాలామంది రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం ఒక అలవాటుగా కొనసాగిస్తున్నారు. అయితే ఇది కేవలం అలవాటు మాత్రమే కాకుండా, నిద్ర నాణ్యతతో పాటు మొత్తం ఆరోగ్యానికి కీలకమని వైద్య నిపుణులు చెబుతున్నారు.నిపుణుల ప్రకారం, రాత్రి పడుకునే ముందు దంతాలు శుభ్రం చేయకపోతే నోట్లో బ్యాక్టీరియా వేగంగా పెరుగుతుంది. రాత్రిపూట లాలాజలం ఉత్పత్తి సగానికి పడిపోవడం వల్ల దంతాలు సహజ రక్షణ కోల్పోతాయి.

#image_title
ఫలితంగా పళ్లు పాడవడం, చిగుళ్ల బలహీనత, ఇన్ఫ్లమేషన్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. అంతేకాకుండా, నిద్రలో హీలింగ్ ప్రాసెస్ దెబ్బతిని శరీర రోగనిరోధక శక్తి తగ్గుతుంది.వైద్యులు చెబుతున్నట్టు, ఉదయం బ్రష్ చేయకపోవడం కన్నా రాత్రి బ్రష్ చేయకపోవడం ఆరోగ్యానికి ఎక్కువ హానికరం. పళ్లు పాడిపోవడం, చిగుళ్ల ఇన్ఫెక్షన్లు, నిద్రలో పళ్లు కొరుక్కోవడం వంటి సమస్యలు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తాయని హెచ్చరిస్తున్నారు.
ప్రశాంతమైన నిద్ర కోసం సూచనలు:
* పడుకునే ముందు కనీసం 60–90 నిమిషాల ముందు భోజనం పూర్తి చేయాలి.
* ప్రతిరోజూ రాత్రి బ్రష్, ఫ్లాసింగ్, టంగ్ క్లీనింగ్ తప్పనిసరి.
* మితమైన పుదీనా, లవంగ నూనె కలిగిన మౌత్‌వాష్ వాడటం మంచిది.
* గురక, పళ్లు కొరకడం వంటి సమస్యలు ఉన్నవారు డాక్టర్ల సూచన మేరకు నైట్ గార్డులు వాడాలి.