Crime : భర్తను గొడ్డలితో నరికి చంపిన భార్య.. కారణమేమిటంటే..!
Crime : సిద్దిపేట జిల్లా చిన్న కోడూర్ మండలంలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ తన కట్టుకున్న భర్తను అందరిముందే గొడ్డలితో నరికి హతమార్చింది. విఠలాపూర్ గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఆ మహిళ భర్త మార్కంటి ఎల్లయ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న
పోలీసులు అక్కడి పరిస్థితులను పరిశీలించారు.ఇరుగు పొరుగు వారి సమాచారం మేరకు.. కుటుంబ కలహాలే హత్యా ఘటనకు దారి తీశాయని ప్రాథమికంగా నిర్ధారించారు. గత కొన్ని నెలల క్రితం భార్యా భర్తల మనస్పర్థలు తలెత్తాయని తెలుస్తోంది. భర్త ఎల్లయ్య.. భార్యను ఏవో కారణాలతో తరచూ వేధించే వాడని సమాచారం.

The wife who chopped her husband to death with an ax
బుధవారం నాడు కూడా ఇలాగే ఇరువురి మధ్య తలెత్తిన గొడవల్లో…విసిగిపోయిన సదరు మహిళ.. ఆగ్రహానికి గురై క్షణికావేశంలో భర్తను కిరాతకంగా నరికి చంపినట్లు సమాచారం. నిందితురాలిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఆమెను పోలీస్ స్టేషన్ కు తరలించి దర్యాప్తు ప్రారభించారు.