ananthampuram.. వలపు వలలో చిక్కుకుని గిలగిల లాడిన వ్యక్తి..
ప్రజెంట్ సోషల్ మీడియా యూసేజ్ బాగా పెరిగిన సంగతి అందరికీ విదితమే. ప్రతీ ఒక్కరు పిల్లల నుంచి మొదలుకుని వృద్ధుల వరకు అందరూ సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలు వివరాలు సేకరించి సైబర్ నేరస్థులు రెచ్చిపోతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ వేదికగా డబ్బులు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లాలోని శింగనమల మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి.. ఓ లేడి విసిన వలపు వలలో చిక్కుకని గిలగిల లాడి రూ.23 లక్షలు నష్టపోయాడు.
ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకెళితే.. వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించే సదరు వ్యక్తికి ఓ అన్‌నౌన్ నెంబర్ నుంచి ‘హాయ్’ మెసేజ్ వచ్చింది. అలా పరిచయం పూర్తి కాగా, వాట్సాప్ ప్రొఫైల్ డిస్ ప్లే పిక్చర్ చూసి అమ్మాయి అని కన్ఫర్మ్ చేసుకున్నాడు సదరు వ్యక్తి. అలా వారిద్దరి మధ్య మాటలు కలిశాయి. తరచూ వాట్సాప్ కాల్స్ మాట్లాడుకుంటున్న క్రమంలోనే ఓ రోజు అమ్మాయి నగ్న వీడియో కాల్ చేసింది. దాంతో అతడు కూడా నగ్న కాల్స్ చేశాడు. మొత్తంగా సదరు వ్యక్తి నగ్న కాల్స్ రికార్డు చేసుకున్న ఆ కి‘లేడీ’ అతడిని బెదిరించడం స్టార్ట్ చేసింది. డబ్బులివ్వకపోతే నగ్న వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదరించి సదరు వ్యక్తి నుంచి రూ.23 లక్షలు కాజేసింది. ఈ నేపథ్యంలోనే బాధితుడి ఫిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.సైబర్ నేరస్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతరపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. అపరిచితుల నుంచి మెసేజ్‌లు వస్తే జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పారు. సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయినట్లు భావిస్తే వెంటనే పీఎస్‌లో లేదా సైబర్ మిత్రకు ఫిర్యాదు చేయాలని సూచించారు.