Castes In Telangana : తెలంగాణాలో ఏన్ని కులాలు ఉన్నాయే తేల్చిన ప్రభుత్వం..!
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీల వారీగా జాబితా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్‌లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్‌లను కేటాయించి గణన చేపడుతోంది. కులం, మతం లేదని చెప్పేవారినీ […]
ప్రధానాంశాలు:
Castes In Telangana : తెలంగాణాలో ఏన్ని కులాలు ఉన్నాయే తేల్చిన ప్రభుత్వం..!
Castes In Telangana : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేపట్టింది. రాష్ట్రంలో అన్ని క్యాటగిరీల్లో కలిపి మొత్తం 243 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓసీ కేటగిరీల వారీగా జాబితా ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కులగణనలో వివరాలను సేకరించేందుకుగాను ఆయా కులాలకు కోడ్‌లను కేటాయించింది. తెలంగాణ వారే కాకుండా ఇక్కడ నివసిస్తున్న ఇతర రాష్ట్రాల వారికి కూడా ప్రత్యేక కోడ్‌లను కేటాయించి గణన చేపడుతోంది. కులం, మతం లేదని చెప్పేవారినీ ప్రత్యేక కోడ్ కింద నమోదు చేస్తోంది. మొత్తంగా కులగణన ప్రశ్నావళిలో కులాలకు సంబంధించి 249 కోడ్‌లను కేటాయించింది. ఈ సర్వేలో కులాల సమాచారంతోపాటు ఆయా కుటుంబాల భూముల వివరాలు, వారికి ఎదురవుతున్న భూ సమస్యలపైనా ఆరా తీస్తోంది. వ్యాపారవేత్తలైతే వారి వార్షిక టర్నోవర్ వివరాలు అడుగుతోంది.
కులాల జాబితాకు సంబంధించి.. ఎస్సీల్లో ఆది ఆంధ్ర నుంచి వల్లూవాన్ వరకు మొత్తం 59 కులాలు ఉన్నట్లు, ఎస్టీల్లో అంధ్ నుంచి నక్కల కుర్వికరణ్ వరకు కలిపి 32 కులాలు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది బీసీ జాబితాలో అన్ని కేటగిరీల్లో కలిపి 134 కులాలు ఉన్నట్లు తెలిపింది. వీటిలో.. బీసీ-ఏ కేటగిరీలో 57 కులాలు, బీసీ-బీలో 27 కులాలు, బీసీ-సీలో 01, బీసీ-డీలో 35, బీసీ-ఈలో 14 కులాల చొప్పున ఉన్నాయి. వీరితోపాటు అనాథలు, పదేళ్ల వయసు రాకముందే తల్లిదండ్రులను కోల్పోయి నిరాశ్రయులైన పిల్లలను బీసీ-ఏ కేటగిరీ కింద నమోదు చేయాలని పేర్కొంది. వీరి కోసం ప్రధాన కాలమ్‌లో కులం కోడ్ కింద 044ను కేటాయించింది. కాగా, క్రిస్టియన్ మతంలోకి మారిన షెడ్యూల్ కులాల (ఎస్సీలు) వారితోపాటు వారి సంతానాన్ని బీసీ-సీలో నమోదు చేస్తున్నారు.
Castes In Telangana ఓసీల్లో 18 కులాలు..
ఓపెన్ కేటగిరీ (ఓసీ)లో మొత్తం 18 కులాలున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. బీసీ-సీలో లేని క్రిస్టియన్లు, బీసీ-ఈలో లేని ముస్లింలను కూడా ఓసీ జాబితా కింద ఉంచారు. వీరికి ప్రత్యేక కోడ్‌లను కేటాయించారు. వీరీ కాకుండా.. జైనులు, బౌద్దులు, లింగాయత్, మార్వాడీ, పట్నాయక్, సిక్కులు, వర్మ లు కూడా ఓసీ జాబితాలోనే ఉన్నారు. ఇంకా ఎవరైనా ఇతరులుంటే వారి కోసం ‘000’ను కోడ్‌గా నమోదు చేయాలని ఎన్యుమరేటర్లకు ప్రభుత్వం సూచించింది. అంతేకాకుండా కులపరమైన వివక్ష, బెదిరింపులు, ఆయా మతాల ప్రార్థనాలయాలకు వెళ్లే అంశాలను కూడా కులగణనలో తెలుసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రశ్నావళిలో ప్రత్యేక ప్రశ్నలను పొందుపరిచారు. ప్రశ్నావళి షెడ్యూల్ కాలమ్ సంఖ్యలో 56వ ప్రశ్నలో ‘ఎలాంటి బెదిరింపులు, వివక్ష లేకుండా మీ కుటుంబంలోని సభ్యులు స్థానిక దేవాలయాలకు, మసీదులకు, చర్చిలు, ప్రార్థనా మందిరాలకు స్వేచ్ఛగా వెళ్లగలుగుతున్నారా?’అని ప్రశ్నిస్తున్నారు.
Castes In Telangana భూ సమస్యలపైనా..
కుటుంబ సభ్యుల భూముల వివరాలను నమోదు చేసే క్రమంలో భూములకు సంబంధించి ఎదుర్కొంటున్న సమస్యలను కూడా తెలుసుకుంటున్నారు. ధరణి వల్ల వచ్చిన పట్టా సమస్య, పట్టా ఉన్నా భూమి ఇతరుల అక్రమ ఆధీనంలో ఉంది, అసైన్డ్ భూమి ఇచ్చారు కానీ పట్టా ఇవ్వలేదు, ఇదే భూమిపై సర్వే జరిగినా అటవీ హక్కు పత్రంం(పట్టా) ఇవ్వలేదు, ప్రభుత్వ భూమి సాగు చేస్తున్నాం, అసైన్డ్ పట్టా కోరుతున్నాం, ఇతరములు లాంటి ప్రశ్నలకు వివరాలను కోడ్‌ల వారీగా నమోదు చేస్తున్నారు.