Vaccine : పిల్లలకు టీకా ఇస్తే లాభం కంటే నష్టమే ఎక్కువ.. ఎయిమ్స్ డాక్టర్ సంచలన కామెంట్స్?
Vaccine : దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటీవల ఒక్కరోజులోనే బ్రిటన్‌లో 10వేల కేసులు నమోదయ్యాయి. దీనిని బట్టి ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త వేరియంట్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే పలుమార్లు అన్ని దేశాలకు హెచ్చరికలు జారీ చేసింది. వాటిని ఆయా దేశాలు సీరియస్‌గా తీసుకోకపోవడంతో విదేశాల్లో కొవిడ్ కొత్త వేరియంట్ కేసులు వేగంగా వ్యాప్తి చెందాయి. ఈ క్రమంలోనే భారత ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు.
శనివారం రాత్రి జాతినుద్దేశించి మాట్లాడిన ప్రధాని మోడీ 15 నుంచి 18ఏళ్ల లోపు వారికి టీకాలు ఇవ్వనున్నట్టు పేర్కొన్నారు. 60 ఏజ్ పై బడిన వారికి బూస్టర్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు.ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని ఎయిమ్స్ డాకర్ట్ సంజయ్ కే రాయ్ విభేదించారు. చిన్నారులకు కొవిడ్ టీకా వేస్తే లాభం కంటే నష్టమే ఎక్కువగా వాటిల్లే ఆస్కారం ఉందన్నారు. ఈయన ప్రస్తుతం ఎయిమ్స్‌లో సీనియర్ ఎపిడెమియోలజిస్ట్‌గా ఉన్నారు. అంతేగాకుండా కొవాగ్జిన్ ట్రయల్స్‌లో ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్‌గా, ఇండియన్ పబ్లిక్ హెల్త్ అసోసియేషన్‌కు డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ట్వీట్ చేశారు. 15 నుంచి 18ఏళ్లలోపు వారికి టీకాలు ఇస్తే సమీప భవిష్యత్తులో వారికి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం లేకపోలేదన్నారు.
Vaccine : పిల్లలకు టీకా ఇస్తే నష్టమే ఎక్కువ..
కొవిడ్ టీకా వేసుకున్నా కూడా కరోనా అటాక్ అవుతుందన్నారు.అయితే, కొవిడ్ టీకా తీసుకున్న వారి శరీరం 90 శాతం మహమ్మారితో పోరాడుతుందన్నారు. విదేశాల్లో పిల్లలపై టీకాలు ఇంకా టెస్టింగ్ దశలో ఉన్నాయన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వలన లాభం కంటే నష్టమే ఉంటుందన్నారు. ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో పేరెంట్స్ ఆందోళనకు గురవుతున్నారని, టీకాలు ఇవ్వడం వలన వారికి కొంత ఆందోళన తగ్గుతుందనడంలో సందేహం లేదన్నారు. కానీ నిజనిర్దారణ తర్వాత ఈ ప్రిక్రియ ప్రారంభిస్తే బెటర్ అని సూచించారు.