Adilabad..సరిహద్దు గ్రామాల ప్రజలపై స్పెషల్ ఫోకస్
కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదు కూడా అవుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సరిహద్దు కలిసి ఉన్న ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల ప్రజలపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సరిహద్దు గ్రామాల ప్రజలు వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలని […]
కొవిడ్ మహమ్మారి ఫస్ట్, సెకండ్ వేవ్ పూర్తి కాగా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చిరస్తున్నారు. ఇక ఇటీవల కాలంలో పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు నమోదు కూడా అవుతుండటంతో అధికారులు అప్రమత్తమవుతున్నారు. అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలోనూ కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంతో సరిహద్దు కలిసి ఉన్న ఆదిలాబాద్ సరిహద్దు గ్రామాల ప్రజలపై ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. సరిహద్దు గ్రామాల ప్రజలు వ్యాక్సిన్ కంపల్సరీగా తీసుకోవాలని బుధవారం ట్విట్టర్ వేదికగా కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా మహమ్మారిని అరికట్టడానికి 18 ఏళ్లు పైబడిన వారు ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని సూచించారు.
వ్యాక్సిన్ తీసుకోవడం ద్వారా కరోనా వైరస్ బారిన పడకుండా ఉండొచ్చని వివరిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాలని, అది కూడా ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ నడుస్తుండగా పలు ప్రాంతాల్లో అధికారులు మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తున్నారు.