దుస్తులు లేకుండా అలా స్నానం చేసే ప్రతి స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాలివి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

దుస్తులు లేకుండా అలా స్నానం చేసే ప్రతి స్త్రీలు తెలుసుకోవాల్సిన విషయాలివి..!

 Authored By aruna | The Telugu News | Updated on :28 October 2023,1:00 pm

పురాణ ఆచారాల ప్రకారం స్నానం చేయడానికి కూడా కొన్ని నియమాలు అనేవి ఉండేవి. కానీ ఇప్పుడు ఆ నియమాలు ఏంటో మనలో చాలామందికి తెలియదు. మరీ ముఖ్యంగా స్త్రీలు స్నానం చేసే సమయంలో ఎలాంటి నియమాలు పాటించాలో కచ్చితంగా తెలుసుకోవాలి. అయితే స్నానం ఎప్పుడు చేయాలి? ఎలా చేయాలి స్నానం చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఏ ఏ సందర్భంలో స్నానం ఆచరించాలి. ఏ ఏ సందర్భంలో ఆచరించకూడదు అనే విషయాలు శాస్త్రాలలో పొందుపరిచడం జరిగింది. ఇక వాటిని ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.

అయితే ఆయుర్వేదం ప్రకారం సూర్యోదయం ముందు సూర్యస్తమయానికి ముందు స్నానం చేయడం ఎంతో అనువైన సమయము అని చెబుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో పునర్జీవన కార్యక్రమాలు మన శరీరంలో చాలా చురుకుగా పనిచేస్తాయి. శాస్త్రం ప్రకారం స్నానం చేసేటప్పుడు మనసు తో పాటు శరీరం కూడా పునరుద్ధరింప చేస్తుంది అని నమ్మకం. అలాగే తెల్లవారుజామున 4 నుంచి 5 గంటల మధ్యలో స్నానం ఆచరించడాన్ని మునిస్నానం అని అంటారు లేదా దీనిని సాధువుల అభ్యంగన స్నానం అని కూడా అంటారు. ఇది స్నానం చేయడానికి అత్యంత అనుకూలమైన వాటిల్లో ఒకటి.

ఈ సమయంలో స్నానం ఆచరిస్తే మనసుకి ఆహ్లాదం, మంచి ఆరోగ్యం, వ్యాధుల నుంచి రక్షణ, రోగ నిరోధక శక్తి పెరగడం, ఏకాగ్రత పెరగడం వంటివి జరుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. ఉదయం 8 గంటలు దాటాక స్నానం చేస్తే కష్టాలు పెరుగుతాయి అట. అలాగే స్నానం 30 నిమిషాల కంటే ఎక్కువ చేయడం తప్పు అని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే స్నానం ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంతంగా శరీరానికి హాయిగా ఉంటుంది. అలాగే స్త్రీలు అలా స్నానం అస్సలు చేయకూడదట. ఎందుకంటే నీటిలో అగ్ని దేవుడు ఉంటాడని నమ్మకం. అందుకే అలా స్నానం చేయకూడదని శాస్త్రం చెబుతోంది. అలాగే స్నానం చేసిన తర్వాత తడి బట్టలను ఎట్టి పరిస్థితుల్లో ధరించకూడదు.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది