Categories: HealthNews

Health Tips | ఎముకలను బలహీనపరచే ఆహారాలు ఇవే.. వాటిప‌ట్ల జాగ్రత్తగా ఉండండి!

Health Tips | శరీర ఆరోగ్యానికి కాల్షియం ఎంతో ముఖ్యమైన ఖనిజం. ఇది ఎముకలు, దంతాలను బలంగా ఉంచడమే కాకుండా రక్తపోటు నియంత్రణ, కండరాల కదలికలు, కణాల పనితీరులో కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే మనం రోజూ తీసుకునే కొన్ని ఆహారాలు కాల్షియం శోషణను తగ్గించి ఎముకలను బలహీనపరుస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ ఆహారాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

#image_title

శీతల పానీయాలు (సోడా)
నేటి కాలంలో చిన్నా పెద్దా అందరూ సోడా పానీయాలు ఇష్టంగా తాగుతారు. కానీ ఇవి ఎముకల శత్రువులుగా మారతాయి. వీటిలో ఉండే ఫాస్ఫోరిక్ ఆమ్లం శరీరంలో కాల్షియం శోషణను అడ్డుకుంటుంది. ఫలితంగా ఎముకలు క్రమంగా బలహీనపడతాయి.

రెడ్‌ మీట్‌, ప్రాసెస్ చేసిన మాంసం
మేక మటన్, సాసేజ్, బేకన్, హాట్‌ డాగ్స్ వంటి ప్రాసెస్ చేసిన మాంసం యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచుతాయి. ఇది ఎముకలపై ప్రతికూల ప్రభావం చూపి కాల్షియం శోషణను తగ్గిస్తుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యం క్షీణిస్తుంది.

తీపి పదార్థాలు – కేకులు, క్యాండీలు, కుకీలు
బేకరీ ఆహారాలు శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్లతో నిండి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను కలిగించి కాల్షియం శోషణను అడ్డుకుంటాయి. దీని ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. ఆరోగ్యకరమైన జీవనశైలికి తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించడం అవసరం.

టీ, కాఫీ
టీలో, కాఫీలో ఉండే కెఫిన్ శరీరంలో కాల్షియం నిల్వలను తగ్గిస్తుంది. రోజుకు ఎక్కువ కప్పులు తాగడం వల్ల ఎముకలు త్వరగా నాజూకుగా మారతాయి. వీటికి బదులుగా పాలు, మజ్జిగ లేదా కాల్షియం అధికంగా ఉండే పానీయాలు తీసుకోవడం మంచిది.

ఆల్కహాల్
మద్యం సేవించడం వల్ల శరీరంలోని కాల్షియం స్థాయిలు పడిపోతాయి. ఇది ఎముకల దృఢత్వాన్ని తగ్గించి ఎముక పగుళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది. బలమైన ఎముకల కోసం మద్యం వినియోగాన్ని పూర్తిగా మానేయాలని వైద్యులు సూచిస్తున్నారు.

నూనె పదార్థాలు
సమోసాలు, బజ్జీలు, వేయించిన చికెన్ వంటి నూనె పదార్థాలు రుచిగా ఉన్నా, ఇవి శరీరంలో వాపు, మంటలకు కారణమవుతాయి. దీనివల్ల కాల్షియం శోషణ తగ్గి ఎముకలు బలహీనపడతాయి. కాబట్టి నూనె ఆహారాల బదులుగా తేలికపాటి, ప్రోటీన్ మరియు కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.

Recent Posts

Capsicum | శీతాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన కూరగాయ కాప్సికమ్.. మలబద్ధకం నుంచి గుండె ఆరోగ్యానికి వరకు

Capsicum | శీతాకాలం వచ్చేసింది. ఈ సీజన్‌లో చలి మాత్రమే కాదు, అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి.…

28 minutes ago

Poha | అటుకులు ఓన్లీ ఆహారం కాదు… ఆరోగ్యానికి ఔషధం, ఎలానో తెలుసా?

Poha |  ప్రతిరోజూ ఒకే రకం ఆహారం తింటూ బోర్ ఫీల్ అవుతున్నారా? అలాంటప్పుడు మీ మెనూలో అటుకులు (పోహా) ని…

2 hours ago

Holidays | నవంబర్‌లో విద్యార్థులకు వరుస సెలవులు.. మరోసారి హాలిడే మూడ్‌లో స్కూళ్లు, కాలేజీలు!

Holidays | దసరా, దీపావళి సెలవుల సందడి ముగిసినప్పటికీ విద్యార్థులు ఇంకా హాలిడే మూడ్‌లోనే ఉన్నారు. అక్టోబర్ నెలలో పండుగలతో పాటు…

4 hours ago

Amla Juice | ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి-మునగ రసం తాగండి.. అద్భుతమైన ఆరోగ్య ఫలితాలు మీ సొంతం!

Amla Juice | ఉదయం మనం తినే మొదటి ఆహారం శరీరంపై పెద్ద ప్రభావం చూపుతుంది. అందుకే వైద్య నిపుణులు…

7 hours ago

Mint Leaves | పుదీనా ఆకుల అద్భుత గుణాలు ..వంటల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు

Mint Leaves | వంటల్లో రుచిని, సువాసనను పెంచే పుదీనా ఆకులు ఆరోగ్యానికి కూడా అనేక విధాలుగా ఉపయోగకరమని వైద్య…

7 hours ago

Banana | ఎర్ర అరటిపండు ఆరోగ్య రహస్యం .. గుండె నుంచి జీర్ణవ్యవస్థ వరకు అద్భుత ప్రయోజనాలు

Banana | సాధారణ పసుపు అరటిపండ్లతో పోలిస్తే ఎర్ర అరటిపండ్లు (Red Bananas) ఆరోగ్య పరంగా మరింత శక్తివంతమని పోషకాహార…

10 hours ago

Tea | టీ, కాఫీ తర్వాత నీళ్లు త్రాగడం ఎందుకు తప్పనిస్సరి ..నిపుణుల సూచనలు

Tea | ప్రపంచవ్యాప్తంగా టీ, కాఫీ ఇప్పుడు జీవితంలో విడదీయలేని భాగంగా మారాయి. ఉదయం లేవగానే ఒక కప్పు టీ లేదా…

12 hours ago

Money | కలలో డబ్బు కనిపించడం మంచా? చెడా..? .. జ్యోతిష్య, మనస్తత్వ శాస్త్ర వేత్తల విశ్లేషణ

Money |  డబ్బు మనిషి జీవితంలో ఎంత ముఖ్యమో చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న అవసరం అయినా, పెద్ద కోరిక…

13 hours ago