Modi – Pawan Kalyan : ఇదయ్యా పరిస్థితి — మోడీ దృష్టిలో పవన్ కల్యాణ్ విలువ ఇది…!!
Modi – Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి తెలుసు కదా. ఆయన పార్టీని స్థాపించిన తర్వాత వెంటనే టీడీపీకి మద్దతు ఇచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీతో పొత్తు అన్నారు. బీజేపీ పార్టీకి మాది మిత్రపక్షం అన్నారు. కానీ.. అసలు.. సినిమాలలో పవర్ స్టార్ గా ఉన్న పవన్ కళ్యాణ్ కు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చే విలువ ఏంటో తెలుసా? అదేంటో తెలిస్తే అందరూ షాక్ అవ్వాల్సిందే. ఎందుకంటే.. ఏకంగా వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిలనే.. సాక్షాత్తూ ప్రధాని మోడీకి ఫోన్ చేసి మాట్లాడారు. దాదాపు 10 నిమిషాల పాటు ఇద్దరూ మాట్లాడుకున్నారు.
దీంతో అసలు పవన్ కు ఉన్న విలువ ఏంటో తాజాగా తెలిసిపోయింది. ఎందుకంటే.. ఇటీవల ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో షర్మిల పాదయాత్ర నిర్వహిస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు తనను అడ్డుకొని దాడి చేసిన విషయం తెలిసిందే. తన వాహనాలను కూడా ధ్వంసం చేశారు. తనపై దాడికి ఒడికట్టడంతో వెంటనే షర్మిల ప్రగతి భవన్ కు బయలుదేరడంతో తనను సోమాజీగూడలో పోలీసులు అడ్డుకున్నారు. వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని షర్మిలను బెదిరించారు. షర్మిల అస్సలు వాహనం నుంచి దిగకపోవడంతో వాహనంలోనే ఉన్న షర్మిలను అలాగే వెహికిల్ తో అటాచ్ చేసి తన వాహనాన్ని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.
Modi – Pawan Kalyan : వాహనం నుంచి దిగని షర్మిల
దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ విషయం గురించి మాట్లాడేందుకే షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్ చేశారు. తనకు ఫోన్ చేసి పరామర్శించినందుకు ప్రధాని మోడీకి షర్మిల ధన్యవాదాలు తెలిపారు. ఇక్కడే అందరూ పవన్ గురించి చర్చించుకుంటున్నారు. ఎందుకంటే.. ఇటీవల పవన్.. వైజాగ్ పర్యటనకు వెళ్లినప్పుడు అనుమతి తేదని ర్యాలీ చేయనీయకుండా హోటల్ లోనే పోలీసులు పవన్ ను ఉంచేశారు. బయటికి రానివ్వలేదు. అప్పట్లో ఆ ఘటన కూడా వైరల్ అయింది. కానీ.. పవన్ కు మోడీ మాత్రం అప్పుడు ఫోన్ చేయలేదు. పవన్ కళ్యాణ్ తన పరిస్థితి గురించి చెప్పినా కూడా మోదీ ఫోన్ చేసి పరామర్శించకపోవడం ఏంటి అంటూ అందరూ పెదవి విరుస్తున్నారు.