YS Jagan : ఈ ఒక్క స్కీమ్ తో జగన్ కి తిరుగులేదంతే.! అందుకే ప్రతి సంవత్సరం టంచనుగా ఇచ్చేస్తున్నాడు..!!
YS Jagan : ఇవాళే కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాం. కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టి కనీసం ఒక రోజు కూడా కాలేదు అప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ సరికొత్త న్యూస్ అందించారు. అది కూడా సామాజిక పెన్షనర్లకు. నిజానికి.. తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పెన్షన్ ను పెంచుతున్నట్టు జగన్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అందుకే.. ఇప్పుడు వరుసగా నాలుగో సంవత్సరం.. పెన్షన్ ను పెంచబోతున్నారు. ఇప్పుడు ఏకంగా రూ.2750 గా పెన్షన్ ను పెంచుతున్నట్టు తాజాగా ప్రకటించారు.
తొలిరోజు అంటే జనవరి 1 నుంచే ప్రతి ఇంటికి పెన్షన్ ను ఖచ్చితంగా అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. దాని కోసం ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్ ను అందిస్తున్నారు. ఈ నెల నుంచి పెరిగిన పెన్షన్ 2.31 లక్షల మందికి కొత్తగా అందనుంది. పాత పెన్షన్లు కూడా కలిపి మొత్తం కలిసి ఏపీలో 64 లక్షల మందికి పైగా పెన్షన్ అందనుంది. సామాజిక పెన్షన్ల కోసమే పెరిగిన పెన్షన్ ప్రకారం.. నెలకు సామాజిక పెన్షన్ల కోసమే రూ.1700 కోట్లు ఖర్చు అవుతున్నట్టు వైసీపీ ప్రభుత్వం చెబుతోంది.
YS Jagan : జనవరి 3 నుంచి 10 వరకు పెన్షన్ వారోత్సవాలు
జనవరి 3 నుంచి జనవరి 10 వరకు ఏపీ మొత్తం పెన్షన్ వారోత్సవాలను నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 3న ఏపీ సీఎం వైఎస్ జగన్ రాజమహేంద్రవరానికి వెళ్లనున్నారు. పెన్షన్ వారోత్సవాలను ప్రారంభిస్తారు. 2024 ఎన్నికల వరకు పెన్షన్ ను రూ.3000 కు పెంచనున్నారు. అయితే.. కేవలం పెన్షనర్లే 64 లక్షలు ఉండటంతో వీళ్లంతా కనీసం వైసీపీకి ఓటర్లుగా మారితే కొంతలో కొంత వైసీపీకి మేలు జరుగుతుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఏది ఏమైనా.. సామాజిక పెన్షన్ల విషయంలో మాత్రం వైఎస్ జగన్ సరికొత్త రికార్డును నెలకొల్పారనే చెప్పుకోవాలి.