Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆప్షన్లు.! వైసీపీ ప్రశ్నకు బదులేది.? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఆప్షన్లు.! వైసీపీ ప్రశ్నకు బదులేది.?

 Authored By prabhas | The Telugu News | Updated on :5 June 2022,8:20 am

Pawan Kalyan : 2024 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా.? అని ఆంధ్రప్రదేశ్‌లో అధికార పక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సూటిగా జనసేన పార్టీని ప్రశ్నిస్తోంది. పొత్తులు పెట్టుకుంటారా.? ఒంటరిగా పోటీ చేస్తారా.? పొత్తులు పెట్టుకుంటే, ‘బిచ్చం నాయక్..’, పొత్తు పెట్టుకోకపోతే ‘భీమ్లానాయక్’ అని వైసీపీ నేత, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ జనసేన పార్టీకి తరచూ సవాల్ విసురుతుంటారు. కానీ, జనసేనాని అధికార వైసీపీ ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పలేదు సరికదా, ‘మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్’కి సమాధానం చెప్పినట్లుగా ఆప్షన్స్ ఇచ్చేశారు.

జనసేన ముందు మూడు ఆప్షన్స్ వున్నాయంటూ జనసైనికులకే పెద్ద పరీక్ష పెట్టారాయన. ఒకటేమో బీజేపీతో కలిసి వెళ్ళడమట, ఇంకోటేమో టీడీపీ, బీజేపీతో కలిసి పోటీ చేయడమట. మూడోది మాత్రం ఒంటరిగా పోటీ చేయడమట. ‘గతంలో నేను తగ్గాను.. ఇప్పుడు తగ్గడానికేమీ లేదు. తగ్గాల్సింది మీరే..’ అంటూ టీడీపీ అధినేత చంద్రబాబుని ఉద్దేశించి సినిమాటిక్ డైలాగు చెప్పారు పవన్ కళ్యాణ్. ఇదేమన్నా సినిమానా.? కాదు కదా.! ఇది రాజకీయం. జనానికి సేవ చేయడానికే రాజకీయాల్లోకి రావాలి ఎవరైనా. ఈ క్రమంలో పొత్తులనేవి సర్వసాధారణమే కావొచ్చు.

Three Options Pawan Kalyan Same Old Pattern

Three Options, Pawan Kalyan Same Old Pattern

ఆ విషయాన్ని అయినా స్పష్టంగా చెప్పాలి కదా.?జనసైనికులు కేవలం జనసేన జెండా మాత్రమే పట్టుకుంటే సరిపోతుందా.? లేదంటే, టీడీపీతో పాటు బీజేపీ జెండా కూడా పట్టుకోవాలా.? అన్నదానిపై పవన్ కళ్యాణ్ స్పష్టత ఇవ్వాల్సి వుంది. కానీ, పవన్ కళ్యాణ్ నుంచి అలాంటి స్పష్టతని ఎవరూ ఆశించకూడదు. ఆయన మాత్రం నిబద్ధతతో రాజకీయాలు చేసేస్తున్నామని చెప్పేసుకుంటారు. నిబద్ధత అంటే జవాబుదారీతనం. ప్రజలకో, జనసైనికులకో అయినా పొత్తుల విషయమై పవన్ కళ్యాణ్ జవాబుదారీతనం చూపాలి కదా.?

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది