Wedding : దండ విసిరేశాడని పెళ్లి వద్దన్న పెళ్లి కూతురు…!

Authored By venkat G | The Telugu News | Published on: January 29, 2022, 4:00 pm

Wedding : ఈ మధ్య కాలంలో పెళ్ళిళ్ళు వివాహాలు కాస్త సరదాగా మారిపోయాయి. క్లాసు రూముల్లో పెళ్ళిళ్ళు, పెళ్లి చేసుకున్న తర్వాత ఏడాదికి ఇచ్చే విడాకులు, ఏదోక కారణంతో ఆగిపోయే పెళ్ళిళ్ళు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. దీనిపై సమాజం కూడా భయపడే పరిస్థితి వస్తుంది. అన్నీ అనుకుని పెళ్లి పీటల మీద కూర్చున్న తర్వాత కూడా పెళ్లి జరుగుతుందనే నమ్మకం రావడం లేదు.

తాజాగా ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక ఘటన అందరిని ఆశ్చర్యపరిచింది. పూలదండ కారణంగా వివాహం ఆగిపోవడం సంచలనం అయింది. ఉత్తరప్రదేశ్ లోని ఔరైయా లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివాహం సమయంలో వధూ వరులు దండలు మార్చుకునే తరుణం వచ్చింది.

throws the wand at the wedding

throws the wand at the wedding

అయితే వరుడు పూల దండను పెళ్లి కూతురు మెడలో వేయకుండా విసిరేశాడు. దీనితో పెళ్లి కూతురికి అరికాలు మంట నెత్తికి ఎక్కి ఇదేం పద్ధతి అని అక్కడే గొడవ పడింది. ఇది పద్ధతి కాదని చెప్పినా సరే పెళ్లి కొడుకు తాను చేసింది కరెక్ట్ అని సమర్ధించుకునే ప్రయత్నం చేసాడు. దీనితో రెండు వర్గాల మధ్య గొడవ క్రమంగా పెరిగింది. ఆ గొడవ పెద్దది కావడంతో పెళ్లి క్యాన్సిల్ అయింది.

venkat G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp