Tik Tok : బిగ్ బిగ్ బ్రేకింగ్ – ఇండియాలో టిక్ టాక్ కమింగ్ సూన్
Tik Tok : షార్ట్ వీడియో ప్లాట్ ఫామ్ టిక్ టాక్ అతి తక్కువ సమయంలో ఏ స్థాయిలో సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. షార్ట్ వీడియో అనే కాన్సెప్ట్ ను తీసుకు వచ్చింది టిక్ టాక్ అనడంలో సందేహం లేదు. 2020 సంవత్సరంలో మోడీ ప్రభుత్వం చైనా కు చెందిన సంస్థలు అంటూ టిక్ టాక్ ను బ్యాన్ చేయడంతో అప్పట్లో టిక్ టాక్ మీద ఆధారపడ్డ వారు ఆవేదన వ్యక్తం చేశారు. టిక్ టాక్ పోయిన తర్వాత ఇన్ స్టా గ్రామ్ రీల్స్ ను మొదలు పెట్టింది.
ఆ తర్వాత ఎన్నో యాప్స్ కూడా షార్ట్ వీడియో స్ట్రీమింగ్ ను తీసుకు వచ్చింది. దాంతో టిక్ టాక్ ను జనాలు మర్చి పోయారు. టిక్ టాక్ బ్యాన్ అయ్యి రెండు సంవత్సరాలు అవుతున్న ఈ సమయంలో మళ్లీ టిక్ టాక్ మొదలు అవ్వబోతుంది అంటూ ప్రచారం జరుగుతోంది. ముంబయికి చెందిన స్కైప్ స్పోర్ట్స్ అనే సంస్థ టిక్ టాక్ మాతృ సంస్థ అయిన బైట్ డ్యాన్స్ తో చర్చలు జరిపిందట. దాంతో త్వరలోనే ఇండియాలో మళ్లీ టిక్ టాక్ షార్ట్ వీడియోలను స్ట్రీమింగ్ చేయబోతున్నాం అంటూ వార్తలు వస్తున్నాయి.
ఆగస్టు చివర్లో లేదా సెప్టెంబర్ వరకు అన్ని విషయాలపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిక్ టాక్ సూపర్ హిట్ అయిన నేపథ్యంలో అప్పట్లో మంచి పాపులారిటీని దక్కించుకుంది. కాని ఇప్పుడు ఇన్ స్టా రీల్స్ కు మంచి ఆధరణ ఉంది. కనుక మళ్లీ టిక్ టాక్ ను జనాలు ఆధరిస్తారా అనేది అనుమానమే. టిక్ టాక్ గతంలో మాదిరిగా ఆధరణ దక్కించుకోవడం అంటే సాధ్యం అయ్యే విషయం కాకపోవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.