కాలం మారుతోంది… మనం మారుతున్నాం…కాని ఏం కొల్పోతున్నామో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

కాలం మారుతోంది… మనం మారుతున్నాం…కాని ఏం కొల్పోతున్నామో తెలుసా…?

 Authored By govind | The Telugu News | Updated on :19 March 2021,6:00 am

తెలుగు పండుగలల్లో మొదట వచ్చేది ఉగాది. ఉగాది అనగానే ముందుగా గుర్తొచ్చేది మామిడికాయలు. ఎప్పుడైన విన్నారా? వేడి వేడి అన్నం లో ముద్ద పప్పు నోరూరించే మామిడి కాయతో చేసిన ఊరగాయ…అమ్మమ్మ చేతి రోటి పచ్చడి. ఎంత రుచిగా ఉంటాయో కదా? ఎందుకు విన్నారా అని అంటే ఇప్పుడు ఉన్న ప్రస్తుత ప్రపంచంలో చిన్న కుటుంబాల వల్ల ఇలాంటి చిన్న చిన్న ఆనందాలు మిస్ అవుతున్నాముకదా? ఇలాంటి సంతోషాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. కాలక్షేపానికి చందమామ కథలు, తాతలు చెప్పే కాశీ మజిలి కథలు. ఇలా ఎన్నో రక రకాల పోకడలతో గడిపే వారు.

time is changing we are changing what we are missing then

time-is-changing-we-are-changing-what-we-are-missing-then

పుస్తక పఠనం అనేది జీవితంలో ఒక భాగమై ఉండేది. ఇది ఒక కాలక్షేపానికే కాకుండా ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. పదే పదే మన పెద్దలు చెప్పేదదే. పుస్తకాలు చదవండి అని. పుస్తక పఠనం వల్ల ఆలోచన శక్తి పెరుగుతుంది. ఒక సమస్యకు గాను ఎన్ని రకాల పరిష్కారాలు ఉంటాయన్న విచక్షణ జ్ఞానం పెరుగుతుంది. ఇలా ఎన్నో రకాలుగా నిజ జీవితంలో ఉపయోగపడుతుంది. కాని నేటి తరం పిల్లలు పిజ్జాలను, బర్గర్లను ఎంతో ఇష్టంగా తింటున్నారు. వీడియో గేంస్ తో ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. ఇంక పుస్తక పఠనానికి టైం ఎక్కడుంటుంది.

చిన్న చిన్నఆనందాలే అసలైన జీవితం…!

కోతి కొమ్మచ్చి ఆటలు, పులి- మేక, అష్టాచెమ్మ ఇలా ఎన్నో రకాల ఆటలు ఇంట్లో ఆడేవి వీధిలో ఆడే ఆటలతో ఆనందం తో పాటు విజ్ఞానాన్ని కలిగించేవి.అటు ఇటు పరిగెడుతూ ఫిజికల్ ఫిట్నెస్, మెంటల్ గా షార్ప్నెస్ ని పెంచేవై ఉండేవి.కాని ఇప్పుడు చదువుల వల్లో, ఇంకా ఎదైనా కారణాల వల్లో తెలియదు కాని ఈ తరం పిల్లలు తమ బాల్యాన్ని కోల్పోతున్నారు. ఈ పోటి ప్రపంచం లో గెలవలేక ఓడలేక చిన్న చిన్న సమస్యలని కూడా భూతద్దంలో చూస్తూ ఉక్కిరి బిక్కిరై పోతున్నారు.కాసుల కోసం కాదు విలువలతో కూడిన జీవితం కోసం బ్రతికేలా తీర్చిద్దిద్దాలి. అందుకే మనం నడిచే తీరు వారికి మార్గదర్శనం
చేసేదై ఉండాలి. పిల్లలకి బ్రతకడం ఎలాగో నేర్పేదై ఉండాలి. నేటి తరానికి స్ఫూర్తినివ్వాలి.

Also read

govind

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది