Ysrcp : ప్రతిష్టాత్మకంగా జరిగిన తిరుపతి ఉప ఎన్నికల్ల పోలింగ్ పూర్తి అయ్యింది. హోరా హోరీగా సాగిన పోరులో వైకాపా ఘన విజయం సాధించడం ఖాయం అంటూ ఆ పార్టీ నాయకులు మరియు రాజకీయ విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. తిరుపతి ఉప ఎన్నికలపై చాలా నమ్మకం పెట్టుకున్న టీడీపీ మరియు బీజేపీలకు చేదు అనుభవం తప్పదని ముందుగానే వారి మాటలను బట్టి అర్థం అవుతుంది. ఈ ఎన్నికలు ఏక పక్షంగా సాగాయని తప్పకుండా ఇందులో టీడీపీ మరియు బీజేపీపై వైకాపా అభ్యర్థి గురు మూర్తి ఘన విజయం సాధించడం ఖాయం.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనితనంకు ఓటర్లు ఇవ్వబోతున్న తీర్పు అంటూ వైకాపా నాయకులు నమ్మకంగా చెబుతున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల సందర్బంగా తెలుగు దేశం మరియు బీజేపీ నాయకులు దొంగ ఓటర్లను పట్టుకోవడం జరిగింది. కొందరు మీడియా వర్గాల వారు కూడా దొంగ ఓటర్లను గుర్తించారు. ఓటరు కార్డుపై ఉన్న అడ్రస్ ను తండ్రి పేరును చెప్పలేక పోయిన వారు దొంగ ఓటర్లు కాకుండా ఎవరు అంటూ బీజేపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు. గెలుపుపై ధీమా ఉన్న వైకాపా గత ఎన్నికల్లో ఏకంగా 151 సీట్లు దక్కించుకున్న వైకాపా ఎందుకు తిరుపతి ఉప ఎన్నికల్లో మాత్రం గెలుపు కోసం దొంగ ఓట్ల పై ఆధారపడింది అంటూ బీజేపీ నాయకుడు ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. గెలుపు పై నమ్మకం లేకపోవడం వల్లే వారు ఈ పని చేశారనే ఆరోపణలు బీజేపీ నాయకులు చేస్తున్నారు.
వైకాపా ఖచ్చితంగా తిరుపతిలో గెలుస్తుందనే నమ్మకంను వ్యక్తం చేశారు. అయితే మెజార్టీ ఖచ్చితంగా 5 లక్షలు ఉండాల్సిందే అంటూ వైకాపా నాయకులను సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించాడు. మెజార్టీ తగ్గితే ఖచ్చితంగా శిక్ష తప్పదని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించిన నేపథ్యంలో ఏం చేయాలో పాలుపోక వైకాపా నాయకులు ఈ పని చేసి ఉంటారని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ దొంగ ఓట్లకు సంబంధం లేదు అనేది కొందరి వాదన. అయినా ఎక్కడ కూడా దొంగ ఓట్లు అనేవి పడలేదు అనేది ఎలక్షన్ కమీషన్ వాదన.
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.